Asianet News TeluguAsianet News Telugu

వచ్చేసింది...మినీ కంట్రీమాన్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్...

మినీ కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్ కూపర్ ఎస్ జెసిడబ్ల్యు వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. దీని ధర ప్రామాణిక మోడల్ కంటే 1 లక్ష ఎక్కువగా ఉంటుంది. అనేక బ్లాక్ అవుట్ ఎలిమెంట్లతో దీనిని రూపొందించారు. దీని ప్రారంభపు ధర ₹ 42.40 లక్షలు (ఎక్స్-షోరూమ్).

mini country man black limited edition launched inindia
Author
Hyderabad, First Published Oct 30, 2019, 12:41 PM IST

దేశంలో పండుగ కాలాన్ని కొనసాగిస్తూ, మినీ ఇండియా కంట్రీమ్యాన్ కోసం కొత్త లిమిటెడ్  ఎడిషన్ ను  ప్రవేశపెట్టింది. కొత్త మినీ కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్ ధర  ₹ 42.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది భారత మార్కెట్లో కేవలం 24 యూనిట్లకు పరిమితం చేయబడింది. కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్ కూపర్ ఎస్ జాన్ కూపర్ వర్క్స్ (జెసిడబ్ల్యు) ప్రేరేపిత వేరియంట్‌పై ఆధారపడింది. ప్రామాణిక మోడల్ కంటే 1 లక్ష ప్రీమియం ధరతో లభ్యమవుతుంది. కొత్త పరిమిత ఎడిషన్ మోడల్ దాని పేరు సూచించినట్లుగానే  బ్రిటిష్ ఎస్‌యూవీలో స్టీల్త్ కోటేంట్ ను అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.

also read జాగ్వార్‌ విజన్ ఈవీ.. రెండు సెకన్లలో 100 కిమీ స్పీడ్

మినీ కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్‌లోని విజువల్ మార్పులలో కొత్త బ్లాక్ గ్రిల్, జెసిడబ్ల్యు కార్బన్ ఫైబర్ ఫినిష్డ్ ORVM లు, హెడ్‌లైట్, టెల్  లైట్స్   కోసం పియానో ​​బ్లాక్ ట్రిమ్, అలాగే టెయిల్‌గేట్‌లో పియానో ​​బ్లాక్ కంట్రీమాన్ మోనికర్ ఉన్నాయి. కంట్రీమాన్ బ్లాక్ కూడా నలుపు రంగులో బోనెట్ చారలతో వస్తుంది. బ్లాక్ పెయింట్ లో రూఫ్ రెల్స్ కూడా ఉన్నాయి. ఎస్‌యూవీ 18 అంగుళాల జెసిడబ్ల్యు అల్లాయ్ వీల్స్‌, రన్-ఫ్లాట్ టైర్లపై నడుస్తుంది.

mini country man black limited edition launched inindia

మినీ కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్ క్యాబిన్ లోపల హెడ్-అప్ డిస్ ప్లే, మినీ వైర్డ్ ప్యాకేజీ, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, హర్మాన్ మరియు కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. క్యాబిన్ జెసిడబ్ల్యు స్టీరింగ్ వీల్, ఇంటీరియర్ ట్రిమ్‌తో ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్‌ను పొందుతుంది. స్పోర్టియర్ వెర్షన్ కావడంతో మోడల్‌లో జెసిడబ్ల్యు ఏరో కిట్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ యాక్సెస్, సీట్ల మెమరీ ఫంక్షన్ మరిన్ని ప్యాకేజీలో భాగంగా వస్తుంది.

also read లంబోర్ఘిని నుంచి రేస్-రెడీ లంబోర్ఘిని ఉరుస్ ST-X

మినీ కంట్రీమాన్ బ్లాక్ ఎడిషన్‌లో శక్తి 2.0-లీటర్ 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది 189 బిహెచ్‌పి, 280 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను బెల్ట్ చేస్తుంది. మోటారు పాడిల్ షిఫ్టర్లతో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ జత చేయబడింది. పెద్ద నిష్పత్తిలో ఉన్నప్పటికీ  కంట్రీమాన్ జెసిడబ్ల్యు 7.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దీని ఇంధన సామర్థ్యం 14.41 కిలోమీటర్లు (క్లెయిమ్ చేయబడింది).

mini country man black limited edition launched inindia

మార్కెట్ లో పోటీ పరంగా మినీ కంట్రీమాన్ ఖచ్చితంగా అనేక కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీల మధ్య విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, ఆడి క్యూ 3, వోల్వో ఎక్స్‌సి 40, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 లను సాటిగా ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios