Asianet News TeluguAsianet News Telugu

ప్యాసింజర్ వెహికల్స్‌పై మారుతి, హ్యుండాయ్ ‘ఉడుంపట్టు’!!

ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో మారుతి సుజుకిదే ఇంకా హవా కొనసాగుతోంది. తాజాగా గత నెలలో మారుతి సుజుకి ‘స్విఫ్ట్’ మోడల్ కారు రికార్డు స్థాయిలో విక్రయించడంతో టాప్ -10 వాహనాల్లో మొదటి స్థానంలో నిలిచిందని సియామ్ పేర్కొంది.

Maruti Suzuki Swift Outsells Alto in September 2018
Author
Mumbai, First Published Oct 25, 2018, 12:56 PM IST

ముంబై: దేశంలోనే పేరెన్నికగన్న సంస్థ ‘మారుతి సుజుకి’. నాటికి నేటికీ ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో మారుతి ముందు వరుసలో నిలుస్తోంది. వివిధ ఆటోమొబైల్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీతో కంపాక్ట్, ఎస్ యూవీ మోడల్ కార్లను వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చినా మారుతి సుజుకి స్పీడ్ ను తట్టుకోలేకపోతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలోనూ ప్రయాణికుల వాహనాల విక్రయంలో మారుతి సుజుకి హ్యాచ్ బాక్ మోడల్ కారు ‘స్విఫ్ట్’ మొదటి స్థానంలో నిలిచింది.

గతేడాది సెప్టెంబర్ నెలలో కేవలం 13,193 స్విఫ్ట్ కార్లు అమ్ముడు పోతే ఈ ఏడాది 22,228 కార్లను విక్రయించింది మారుతి సుజుకి. స్విఫ్ట్‌తోపాటు మరో ఆరు మారుతి సుజుకి మోడల్ కార్లు విక్రయమవుతున్న టాప్ -10 జాబితాలో ఉన్నాయి. ప్రత్యర్థి సంస్థ హ్యుండాయ్ మోటార్స్ మిగతా మూడు స్థానాలను భర్తీ చేసేంది. 

సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి ‘స్విఫ్ట్’ కార్లు 22,228 యూనిట్లు అమ్ముడు పోతే ‘ఆల్టో’ మోడల్ కార్లు 21,719 యూనిట్లను విక్రయించి రెండో స్థానంలో నిలచింది. అయితే గతేడాది అత్యధికంగా 23,830 యూనిట్ల ఆల్టో మోడల్ కార్లు అమ్ముడు పోవడం గమనార్హం. ఇక మారుతి కంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ 21,296 కార్ల విక్రయంతో మూడో స్థానంలో నిలిస్తే బాలెనో మోడల్ కార్లు 18,631 యూనిట్ల విక్రయంతో నాలుగవ స్థానానికి చేరుకున్నది. 

మారుతి సుజుకి మరో కంపాక్ట్ ఎస్ యూవీ వితాటారా బ్రెజ్జా మోడల్ కార్లు 14,425 యూనిట్లు విక్రయించి ఐదో స్థానంతో సరిపట్టుకున్నది. గతేడాది సెప్టెంబర్ నెలలో వితారా బ్రెజ్జా మోడల్ కార్లు 13,268 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఇంతకుముందు ప్రయాణికుల వాహనాల విక్రయంలో దిగ్గజ స్థానంలో ఉన్న మారుతి సుజుకి కంపాక్ట్ మోడల్ వాగన్ ఆర్ మోడల్ గతేడాది 14,649 కార్ల విక్రయిస్తే, ఈ ఏడాది తగ్గి 13,252 యూనిట్లు విక్రయించి ఆరో స్థానానికి పరిమితమైంది. ఇక మారుతి సుజుకి గ్రాండ్ ఐ10 మోడల్ కార్లు 11,224 యూనిట్ల విక్రయంతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. గతేడాది 14,099 యూనిట్ల విక్రయంతో గ్రాండ్ ఐ 10 ఐదో స్థానంలో ఉంది. 

మరోవైపు మారుతి సుజుకితో సమ ఉజ్జీగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ ఎస్ యూవీ మోడల్ క్రెట్టా మోడల్ కార్లు 11 వేల విక్రయంతో తొమ్మిదో స్థానానికి పరిమితమైతే మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ సెలెరియో 9,208 యూనిట్ల విక్రయంతో పదో స్థానానికి చేరుకున్నది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios