Asianet News TeluguAsianet News Telugu

స్వల్పంగా తగ్గిన మారుతి సేల్స్.. మొబిలిటీ రాయితీల కోసం మారుతి భార్గవ

గత నెలలో మారుతి కార్ల విక్రయాలుస్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే రోడ్లపై రద్దీ, కాలుష్య కారక ఉద్గారాలను తగ్గించడానికి వీలుగా మొబిలిటీ సమసయ పరిష్కరించాలని కేంద్రాన్ని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కోరారు.  

Maruti reports marginal decline in Nov sales at 1,53,539 units
Author
New Delhi, First Published Dec 1, 2018, 2:27 PM IST

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత నెలలో కార్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది నవంబర్ నెలలో 1,54,600 కార్లు విక్రయించిన మారుతి సుజుకి.. ఈ ఏడాది 1,53,539 కార్లు మాత్రమే విక్రయించింది. అక్టోబర్ నెలలో పండుగల సీజన్ వల్ల 2017లో 1,45,300 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది స్వల్పంగా పెరిగి 1,46,018 యూనిట్లను విక్రయించగలిగింది. 

మినీ కార్లుగా పేరొందిన ఆల్టో, వాగన్ ఆర్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 38,204 నుంచి 29,954 కార్లకు (21.6శాతం) తగ్గాయి. కంపాక్ట్ సెగ్మెంట్ మోడల్స్ స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ సేల్స్ విక్రయాలు 10.8 శాతం పెరిగాయి. గతేడాది 65,447 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది 72,533 కార్లు అమ్ముడు పోయాయి. 

ఇక మిడ్ సైజ్డ్ సెడాన్ సియాజ్ గతేడాది నవంబర్ నెలలో 40009 కార్లు విక్రయిస్తే, ఈ ఏడాది 3838 కార్లకు పరిమితం అయ్యాయి. మరోవైపు యుటిలిటీ వాహనాలు విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్, ఎర్టిగా విక్రయాలు 1.9 శాతం పెరిగాయి. గతేడాది 23,072 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది 23,512 కార్లు అమ్ముడు పోయాయి. నవంబర్ నెలలో ఎగుమతులు 19.1 శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది 9,300 కార్లకు ఈ ఏడాది నవంబర్ నెలలో 7,521 కార్లను ఎగుమతి చేసింది మారుతి సుజుకి. 

మొబిలిటీ షేరింగ్ కోసం రాయితీలివ్వాలి
వ్యక్తిగత కార్ల విషయమై మొబిలిటీ షేరింగ్ కోసం ప్రభుత్వం రాయితీలు కల్పించాల్సి ఉన్నదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. పార్కింగ్, రవాణ వ్యయం, రద్దీ తగ్గింపు తదితర అంశాల కోసం మొబిలిటీ షేరింగ్ కోసం వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మొబిలిటీకి వ్యతిరేకంగా ఉండటం సమస్యగా పరిణమించిందన్నారు. మొబిలిటీకి అనుమతిని ఇవ్వడం వల్ల ఐదు కార్ల పని ఒక్క కారే చేయగలదని, ఇది రద్దీని తగ్గించడంతోపాటు ఇంధన వ్యయం కూడా తగ్గముఖం పడుతుందన్నారు. 
ఆయిల్ పై ఆధార పడటానికి బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ సూచించారు. రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొన్న తర్వాత హాయిగా వెళ్లిపోవాలని అందరూ భావిస్తున్నారు. దీనివల్ల సమయం వ్రుధా అవుతుందనే భావన ఏర్పడింది. భారతదేశంలో అమ్ముడు పోతున్న కార్లలో ప్రతి రెండింటిలో ఒకటి మారుతి సుజుకి సంస్థదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ద్విచక్ర వాహన చోదకులు కార్లలో ప్రయాణించడానికి తహతహాలాడుతున్నారు. తమ కార్ల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి చిన్న, చౌక కార్లు తయారు చేయడమేనని ఆర్సీ భార్గవ తెలిపారు. 

అంతర్జాతీయంగా విద్యుత్ ఆధారిత వాహనాల రాకతో గందరగోళం నెలకొన్నా వాహనాల తయారీ దారులు ఆందోళన చెందనవసరం లేదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. భవిష్యత్ లోనూ బలీయమైన బిజినెస్ సాధించొచ్చునని తెలిపారు. బయో ఫ్యూయల్, సీఎన్జీ గ్యాస్ వాడకంతో రోడ్లపై వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందన్నారు. విద్యుత్ వాహనాల తయారీ ఖర్చు, వినియోగదారుడి ఆమోదం సమీప భవిష్యత్‌లో ఒక సవాల్ గానే నిలుస్తుందన్నారు. 2030 నాటికి ఏడు కోట్ల వాహనాలు రోడ్లపైకి వస్తే కోటి వాహనాలు మాత్రమే విద్యుత్ ఆధారిత వినియోగంలో ఉంటాయని చెప్పారు.మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా కార్యక్రమం సమీప భవిష్యత్ లో మొబిలిటీ సమస్యలను పరిష్కరించడంతోపాటు దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను పెంపొందిస్తుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios