Asianet News TeluguAsianet News Telugu

బైకర్లూ!! బీమాపై ఫోకస్ చేయండి: 75% వెహికల్స్‌కు నో ‘పాలసీ’

 రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాద్విచక్ర వాహన యజమానుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వాహనానికి బీమా తీసుకోవాలన్న విషయాన్నీ పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారు బీమా తప్పనిసరని తెలిసినా, తమ వాహనాలకు బీమా చేయించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని ప్రముఖ ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ అగ్రిగేటర్‌ పాలసీ బజార్‌ డాట్‌కామ్‌ అనుబంధ ప్రొడక్ట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (పీఐసీ) జరిపిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Majority of two-wheeler insurance bought online for reviving lapsed policies
Author
New Delhi, First Published Dec 10, 2018, 10:55 AM IST

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాద్విచక్ర వాహన యజమానుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వాహనానికి బీమా తీసుకోవాలన్న విషయాన్నీ పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారు బీమా తప్పనిసరని తెలిసినా, తమ వాహనాలకు బీమా చేయించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని ప్రముఖ ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ అగ్రిగేటర్‌ పాలసీ బజార్‌ డాట్‌కామ్‌ అనుబంధ ప్రొడక్ట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (పీఐసీ) జరిపిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన్‌ ద్వారా టూ వీలర్స్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుంటున్న దాదాపు 10 లక్షల మంది పాలసీదారుల ప్రవర్తనను పరిశీలించి, పీఐసీ ఈ సర్వే నివేదిక రూపొందించింది.
 
దేశంలోని ద్విచక్ర వాహనాల్లో 75 శాతం వాహనాలకు ఎలాంటి బీమా పాలసీ లేకపోగా, ప్రస్తుతం కాలం తీరిన పాలసీల్లో 60 శాతం నెట్‌ ద్వారానే పునరుద్ధరణ జరుగుతోంది.
ప్రతి ద్విచక్ర వాహనం యజమాని పాత పాలసీ గడువు ముగిసిన 90 రోజుల్లోగా మూడో వంతు మంది కొత్త పాలసీ తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. పాత పాలసీ ముగిసిన 90 రోజుల తర్వాత, మూడింట రెండు వంతుల మంది మాత్రమే పాలసీని పున రుద్ధరించుకుంటున్నారు. 2018లో మాత్రం కాంప్రిహెన్సివ్‌ టూ వీలర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు 75 శాతం నుంచి 86 శాతానికి పెరుగడం గమనార్హం. 

మొండి బాకీల వేలంపై పీఎన్బీ ఫోకస్
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)లో మొండి బాకీల(ఎన్‌పీఏ)కు సంబంధించిన దాదాపు 24 ఖాతాలను అమ్మకానికి పెట్టారు. దాదాపు రూ.1779 కోట్లకు పైగా ఉన్న బకాయిలను తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యంగా ఆశావాహుల నుంచి బిడ్‌లను పీఎన్బీ ఆహ్వానించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో నోటీసును పీఎన్‌బీ జారీ చేసింది. కాగా, బకాయిపడిన 24 ఖాతాల్లో బ్యాంకుకు చెందిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా జోన్‌లలో అధికంగా ఉన్నాయి. రెండు ఖాతాలు ఛండీగఢ్‌, భోపాల్‌ జోన్లవి కాగా, ఒకటి పాట్నా జోన్‌కు చెందినదిగా ఉంది. ఈ ప్రక్రియను బ్యాంకుకు చెందిన సస్త్రా విభాగం నిర్వహించనుంది. ఈ-వేలం పద్దతి ద్వారానే బిడ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి నేడే తుది గడువు. ఈ-వేలం ప్రక్రియ ఈనెల 21న జరగనుంది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీలు పీఎన్బీకి దాదాపు రూ.14వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టడంతో బ్యాంకు భారీ దెబ్బను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిపోయిన మొండి బకాయిలతో రూ.4,532.35 కోట్ల నష్టం వాటిల్లినట్టు పీఎన్బీ తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios