Asianet News TeluguAsianet News Telugu

బస్తీమే సవాల్: ఎక్స్‌యూవీ 300తో మహీంద్రా సై

దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త ఎస్ యూవీ మోడల్ కారు ఎక్స్ యూవీ 300 విడుదల చేసింది. అల్టూరస్, మర్రాజ్జో మోడల్ కార్ల మాదిరే దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా. 
 

Mahindra launches XUV300 at starting price of Rs 7.90 lakh
Author
New Delhi, First Published Feb 15, 2019, 1:06 PM IST

దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) ‘ఎక్స్‌యూవీ 300’ఆవిష్కరించింది. ఇది సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం విడుదల చేసిన ఖరీదైన మోడల్ క్స్‌యూవీ 500’కి ఇది తక్కువ స్థాయి మోడల్‌. 

‘ఎక్స్‌యూవీ 500’ మోడల్‌ కంటే కూడా ఈ కొత్త ఎస్‌యూవీకి మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నామని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌, మారుతీ విటారా బ్రెజా, టాటా మోటార్స్‌ నెక్సాన్‌ మోడళ్లకు ఇది పోటీనివ్వనున్నదని ఎంఅండ్‌ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా చెప్పారు.

ఇందులో భాగంగానే మరాజో, అల్టురాస్‌ జీ4తో పాటు తాజాగా ఎక్స్‌యూవీ 300ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. నాలుగు మీటర్ల లోపు పొడవు ఉండే ఈ ‘ఎక్స్‌యూవీ 300’ని 1.2 లీటర్ల పెట్రోలు సామర్థ్యం గల ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ సామర్థ్యం గల రకాల్లో మహీంద్రా ఎక్స్ యూవీ 300 అందుబాటులో ఉంటుంది.

డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 వేరియంట్లలో ఇవి లభ్యమవుతాయి. డబ్ల్యూ4 పెట్రోల్‌ వేరింట్‌ ధర రూ.7.90లక్షలు కాగా.. విలాసవంతమైన డబ్ల్యూ8 (ఓ)డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.11.99లక్షలుగా కంపెనీ పేర్కొంది. కొత్తగా మొదలైన సబ్‌ కాంప్టాక్‌ ఎస్‌యూవీ విభాగంలోకి ఎక్స్‌యూవీ 300 చేరింది. ఎక్స్‌యూవీ 300లో డబ్ల్యూ4,6,8,8(ఓ) విభాగాలు ఉన్నాయి.

చిరుతపులి ఫేస్ స్పిరిట్‌గా ఎక్స్‌యూవీ 300ను డిజైన్‌ చేశారు. ఎక్స్‌యూవీ డిజైన్‌ చాలా స్టైలిష్‌గా, కొత్తగా ఉంది. స్లిమ్‌ గ్రిల్స్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, ఇంటిగ్రేటెడ్‌ స్పాయిలర్స్‌తో తీర్చిదిద్దారు. 

డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌ విత్‌ మెమొరీతో పనిచేసే ఏసీ, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌,  డబ్ల్యూ8(ఓ) వేరియంట్‌ ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ , డేటైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోతో పనిచేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను ఇచ్చారు.

దీనికి మహీంద్రా బ్లూసెన్స్‌ యాప్‌ ద్వారా కనెక్ట్‌ అయి మన డ్రైవింగ్‌ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. ఇంకా ఎక్స్‌యూవీ 300లో 1.2లీటర్‌ పెట్రోల్‌, 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. పెట్రోల్‌ ఇంజిన్‌ 200ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ వద్ద 110 బీహెచ్‌పీ శక్తిని, డీజిల్‌ ఇంజిన్‌ 300 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 115 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

వీటిలో 6స్పీడ్‌ స్టాండర్డ్‌ రకం గేర్‌ బాక్స్‌ను అమర్చారు. రూ.8లక్షల నుంచి రూ.14లక్షల ధరల శ్రేణిలో మార్కెట్‌ను శాసిస్తున్న మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుండాయ్‌ క్రెటా మోడల్ కార్లకు ‘ఎక్స్‌యూవీ 300’ గట్టి పోటీ ఇస్తుందని మహీంద్రా సంస్థ ధీమాగా ఉంది. నెలకు ఆరువేలకు పైగా యూనిట్లను విక్రయించనున్నామని సంస్థ ఎండీ పవన్‌ గోయెంక్‌ తెలిపారు.

మహీంద్రా సంస్థ దీని డిజైన్ అభివ్రుద్ధి చేయడానికి రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందని సంస్థ ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు రాజన్ వాధెరా తెలిపారు. ప్రయాణికుల కార్ల తయారీలో ఎక్స్ యూవీ 300 మోడల్ కారును తమ ఆకాంక్షలకు అద్దం పడుతుందని మహీంద్రా యాజమాన్యం భావిస్తోంది. ఇంతకుముందు అల్టూరస్, మర్రాజ్జో మోడల్ కార్ల మాదిరిగానే దీనికి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios