Asianet News TeluguAsianet News Telugu

సేల్స్‌లో హ్యుండాయ్‌ క్రెటా రికార్డు.. 4 ఏళ్లలోపే ఐదు లక్షలు

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ 2015 జూలైలో విపణిలో అడుగు పెట్టిన క్రెటా కారు నాలుగేళ్లలోపు అరుదైన రికార్డు నమోదు చేసింది. బుధవారానికి ఐదు లక్షల యూనిట్లు విక్రయించింది. 

Hyundai Creta Crosses 5 Lakh Sales Milestone
Author
New Delhi, First Published Feb 28, 2019, 10:52 AM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హుల్యండాయ్‌ మోటార్‌ ఇండియా’తన చరిత్రలో కలికితురాయి వంటి రికార్డు సాధించింది. ఎంతో పాపులర్టీ సాధించిన ఎస్‌యూవీ ‘క్రెటా’మోడల్ కార్ల విక్రయాలు ఐదు లక్షల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది.

దేశీయంగా 3.7 లక్షల హ్యుండాయ్ ‘క్రెటా’ విక్రయాలు
2015 జూలైలో హ్యుండాయ్ సంస్థ ‘క్రెటా’ విపణిలోకి విడుదల చేసింది. నాటి నుంచి దేశీయంగా 3.7 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రెటా కార్ల ఎగుమతులు 1.4 లక్షలకు చేరుకున్నాయి.

27 అవార్డులు అందుకున్న క్రెటా
బుధవారం నాటికి మొత్తంగా ఐదు లక్షలుగా నమోదయ్యాయి. కారు మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లలోనే ఈ స్థాయిలో విక్రయాలు నమోదు అయ్యాయని సేల్స్‌ హెడ్‌ వికాస్‌ జైన్‌ అన్నారు. విపణిలోకి హ్యుండాయ్ క్రెటా మోడల్ కారు అడుగు పెట్టినప్పటి నుంచి ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ఐసీఓటీవై)’ అవార్డుతోపాటు మొత్తం 27 అవార్డులను అందుకున్నది. 

క్రెటా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం
హ్యుండాయ్ కారు ఇటు పెట్రోల్, అటు డీజిల్ వేరియంట్లలో విపణిలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.60 లక్షల నుంచి రూ.15.63 లక్షల మధ్య లభిస్తోంది. అంతే కాదు ప్రత్యర్థి సంస్థలు రెనాల్ట్ డసటర్, మారుతి ‘ఎస్-క్రాస్’, హోండా బీఆర్వీ, నిస్సాన్ టెర్రానో మోడల్ కార్లకు గట్టిగా సవాల్ విసురుతోంది. 

క్రెటాలో ప్రీమియం ఫీచర్లు పుష్కలం
మేడిన్ ఇండియా స్ఫూర్తితో నాలుగేళ్లలో ఐదు లక్షల యూనిట్ల విక్రయాలతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న క్రెటా కారులో పలు ఫ్రీమియం ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, సిక్స్ వే పవర్ డ్రైవర్ సీటుతోపాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ రో, స్మార్ట్ కీ బాండ్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, వైర్ లైస్ ఫోన్ చార్జర్ తదితర ఫీచర్లు చేర్చారు. 

ట్రాన్స్ మిషన్ మోడ్‌లో క్రెటా కార్లు రెడీ
హ్యుండాయ్ క్రెటా కార్లు పెట్రోల్, డీజిల్ ప్లస్ ట్రాన్స్ మిషన్ మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో సిక్స్ స్పీడ్ మాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అమర్చారు. ‘ఐ20 యాక్టివ్’, ‘టుస్కన్’ వంటి మోడల్ కార్లలో మధ్య గ్యాప్‌ను పూడ్చేసేందుకు హ్యుండాయ్ క్రెటా కారు మార్కెట్లోకి ప్రవేశించింది. ఏడు వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. 

ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య జీఎస్టీ రికవరీ రూ.10 వేల కోట్లు 
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత రూ.20వేల కోట్లు ఉండగా, ఇందులో రూ.10 వేల కోట్లు రికవరీ చేశామని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీలో జరుగుతున్న మోసాలను గుర్తించి ఈ చట్టం ఎక్కువ మందికి వర్తించడానికి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ పన్ను అధికారి ఒకరు తెలిపారు. స్థిరాస్తి రంగానికి ఇటీవల జీఎస్‌టీ రేటు తగ్గించిన నేపథ్యంలో కొత్త శ్లాబ్‌కు మారేందుకు గల సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆ రంగ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర పరోక్ష పన్ను మండలి, కస్టమ్స్‌ సభ్యులు (పరిశోధన) జాన్‌ జోసెఫ్‌ బుధవారం చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios