Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి కొత్త హోండా సీబీ యూనికార్న్‌150 బైక్‌


హోండా మోటార్స్ మార్కెట్లోకి యూనికార్న్ 150 ఏబీఎస్ బైక్‌ను ఆవిష్కరించింది. దీని దర రూ.78,815 కాగా, నలుపు, ఎరుపు, ఊదా రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

Honda Unicorn 150 ABS Launched; Navi Gets CBS
Author
New Delhi, First Published Feb 27, 2019, 1:39 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా కొత్త సీబీ యూనికార్న్‌ 150 బైక్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్‌ను సంస్థ యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో అప్‌డేట్‌ చేసింది. ఈ వాహనం ధరను కంపెనీ రూ.78,815గా నిర్ణయించింది.

నాన్‌ ఏబీఎస్‌ వేరియంట్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్‌ ధర రూ.6,500 ఎక్కువగా ఉంది. సింగిల్‌ చానల్‌ ఏబీఎస్‌, లాంగ్‌ సీట్‌, సాఫ్ట్‌ సస్పెన్షన్‌, నో నాన్‌సెన్స్‌ డిజైన్‌ తదితర ప్రత్యేకతలు ఈ బైక్‌ సొంతం. ఇందులో 149.2 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. 

హోండా సీబీ యూనికార్న్ 150 సీసీ బైక్ ఇంజిన్‌ మాగ్జిమమ్‌ పవర్‌ 12.73 హెచ్‌పీఏ 5500, బైక్‌ మాగ్జిమమ్‌ టార్క్‌ 12.8 ఎన్‌ఎంఏ5500 ఆర్‌పీఎంగా ఉంటుంది. ఇక నేవీ సీబీఎస్ మోడల్ బైక్ ధర రూ.47,110.. కాగా, స్టాండర్డ్ వేరియంట్ బైక్ తో పోలిస్తే రూ.1796 ఎక్కువ.

ఈ హోండా మోటార్స్ యూనికార్న్ 150 ఏబీఎస్ మోడల్ బైక్‌లో ఐదు గేర్లు ఉంటాయి. బైక్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనోషాక్‌ యూనిట్‌ ఉంటుంది. అలాగే ఇందులో అనలాగ్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ కన్సోల్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనం నలుపు, ఎరుపు, ఊదా రంగుల్లో లభిస్తుందని సంస్థ తెలిపింది.

150 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజీన్‌,  ఫైవ్‌ స్పీడ్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌  సింగిల్‌ చానెల్‌ ఏబీస్‌, 18అంగుళాల అల్లోయ్‌ వీల్స్‌, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక 150 సీసీ  సెగ్మెంట్‌లో మార్కెట్లో  బజాజ్‌ పల్సర్‌ 150, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160, హీరో అఛీవర్‌ 150కి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios