Asianet News TeluguAsianet News Telugu

దీపావళి స్పెషల్: ‘ద్విచక్ర’ వాహనాల ఆఫర్ల వర్షం

ద్విచక్ర వాహనాల తయారీ దారులు దీపావళి సందర్భంగా క్యాస్ డిస్కౌంట్లు, తక్కువ వడ్డీరేట్లపై ఈఎంఐలు, అందజేస్తున్నాయి. 110 సీసీ స్కూటర్లు మొదలు కమ్యూటర్స్ బైక్స్ నుంచి స్పోర్టీ అండ్ పవర్ ఫుల్ 200, 250 సీసీ మోటారు సైకిళ్ల వరకు రకరకాల ఆఫర్లు అందిస్తున్నాయి. 

Diwali Discounts 2019: Best Offers On Two-Wheelers This Festive Season
Author
Hyderabad, First Published Oct 27, 2019, 11:11 AM IST

న్యూఢిల్లీ: భారతదేశంలో పండుగల సీజన్ ఉత్సాహ పూరిత వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ప్రతి ఒక్కరూ దీపావళి సందర్భంగా కొత్త వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ప్రత్యేకించి దీపావళి సందర్భంగా మోటారు సైకిళ్లు, స్కూటర్లపై పలు రకాల డిస్కౌంట్లు, రాయితీలు అందజేస్తున్నాయి. గతంతో పోలిస్తే మోటారు సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థలు తమ వినియోగదారులకు భిన్నమైన ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి. 

మోటార్ షో: కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -25ఆర్

వివిధ క్యాటగిరీల మోటారు సైకిళ్లు, స్కూటర్ల వారీగా ఆయా సంస్థలు క్యాష్ డిస్కౌంట్లు, తక్కువ వడ్డీరేట్లు, తక్కువ ఈఎంఐలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. 200 నుంచి 250 సీసీ మోటారు సైకిళ్ల నుంచి 110 సీసీ స్కూటర్లు మొదలు కమ్యూటర్ బైక్స్ నుంచి స్పోర్టీ బైక్స్ తయారీ సంస్థలు పలు ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిని ఒక్కసారి పరిశీలిద్దాం.. 

 

దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్ బైక్‌ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ తన స్కూటర్లు, మోటారు సైకిళ్లపై పలు ఆఫర్లు అందిస్తోంది. స్కూటర్ రేంజీ టూ వీలర్స్ మాస్టెరో ఎడ్జి, ప్లీజర్, డ్యుయట్, డెస్టినీ 125, మాస్టెరో 125లపై ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.3000తోపాటు క్యాష్ డిస్కౌంట్ రూ.2000తోపాటు 6.99 శాతం వడ్డీరేటుపై అందజేయనున్నది. రూ.3,999 చెల్లించి స్కూటర్ తెచ్చుకోవచ్చు. 

స్కూటీలపై నెలవారీగా ఈఎంఐ అత్యల్పంగా రూ.1750గా నిర్దేశించుకోవచ్చు. కమ్యూటర్ మోటారు సైకిల్ శ్రేణిలో స్పెండర్ సిరీస్, పాషన్ సిరీస్, గ్లామర్ రేంజ్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటారు సైకిళ్లపై రూ.1500 క్యాష్ బెనిపిట్ అందిస్తోంది. 6.99 శాతం వడ్డీరేటుపై రుణాన్ని అందించనున్నది. 

విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు

200 సీసీ సామర్థ్యం గల మోటారు సైకిల్ రేంజి బైక్ లు ఎక్స్ ట్రీమ్, ఎక్స్ పల్స్ సిరీస్ మోటారు సైకిళ్లపై రూ.5000 ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, క్యాష్ బెనిఫిట్లు రూ.2000 వరకు అందిస్తాయి. అదనంగా 6.99 శాతం వడ్డీరేటుపై తక్కువ ఈఎంఐ రూ.1750తో కొనుగోలు చేయొచ్చు. హీరో మోటో కార్ప్స్ సంస్థ ఇతర మోటారు సైకిళ్లు, స్కూటర్లపై అదనంగా రూ.2100 బెనఫిట్లు, పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే రూ.10 వేల బెనిఫిట్ లభిస్తుంది. 

అత్యధిక మోటారు సైకిళ్ల ఎగుమతి దారు బజాజ్ ఆటో తన మోటారు సైకిళ్ల క్యాటగిరీల్లో రూ.7200 వరకు బెనిఫిట్లు అందిస్తోంది. బజాబ్ డొమినార్ 400 మోడల్ వంటి బైక్స్‌పై ఫెస్టివ్ సీజన్‌లో రూ.6000 ప్లస్ 5 ఫ్రీ సర్వీసెస్ ప్లస్ ఐదేళ్ల ఫ్రీ వారంటీ అందిస్తోంది. పల్సర్ 220 ఎఫ్ బైక్ మీద రూ.5000 వరకు పల్సర్ 150 రూ.4200 బెనిఫిట్ లభిస్తుంది. 

బజాజ్ ఇంకా సీటీ 100, ప్లాటినా హెచ్ గేర్ 110 బైక్ మీద రూ.3200, రూ.37 వేల వరకు రాయితీ లభిస్తుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో రూ.3699 చెల్లిస్తే మోటారు సైకిల్ తీసుకెళ్లొచ్చు. అవెంజర్, వీ రేంజ్ బైక్‌లపై ఆఫర్లు ఉన్నాయి. 

మరో ద్విచక్ర వాహనాల సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కూడా ఫెస్టివ్ సీజన్‌లో వినియోగదారులకు బెనిఫిట్లు అందిస్తుంది. హోండా యాక్టీవా 5జీతోపాటు హోండా సీబీ షైన్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌పై రూ.11 వేలకు డిస్కౌంట్ లభిస్తుంది. 

ఈ రెండు ఉత్పత్తుల కొనుగోలుపై రుణం తీసుకుంటే రూ.8900 వరకు ఆదా చేయొచ్చు.  ఫ్రీ హోండా జాయ్ క్లబ్ సభ్యత్వం రూ.2,100లకు పొందొచ్చు. రూ.7000 డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ తీసుకెళ్లొచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అగ్రశ్రేణి డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. 

ఇండియా యమహా మోటార్స్ ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో ఎఫ్ జడ్, ఎఫ్ఐ, ఎఫ్ జడ్-ఎస్ మోటారు సైకిళ్లపై రూ.8,280 రాయితీ కల్పిస్తోంది. రూ.4,999 డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ తీసుకెళ్లొచ్చు. అదీ కూడా 6.9 శాతం వడ్డీరేటుపై లభిస్తుంది. 

సుజుకి మోటార్ సైకిళ్లపై ఫెస్టివ్ సీజన్ సందర్భంగా యాక్సెస్ 125, బర్గ్ మాన్ స్ట్రీట్ 125, గిక్సర్ ఎస్ఎఫ్, ఇంట్రూడర్ మోడల్ బైకులపై రూ.13 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 5.99 శాతం వడ్డీరేటుపై ఆపర్లు లభిస్తాయి. గిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ ఆఫ్షన్ తో పొందొచ్చు. ప్రస్తుతం రూ.1.70 లక్షలు పలుకుతున్న గిక్సర్ బైక్ మీద రూ. లక్షకు రూ.3,042 చొప్పున ఈఎంఐ ఖరారు చేసుకుని బుక్ చేసుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios