Asianet News TeluguAsianet News Telugu

పదేళ్లలో సగం కార్లు సీఎన్జీతోనే నడుస్తాయి: నొమురా

కేంద్ర ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పిస్తే 2030 నాటికి సగం కార్లు సీఎన్జీ గ్యాస్ తోనే నడుస్తాయని నొమురా పేర్కొంది. సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను వచ్చే 10 ఏళ్లలో 10 వేలకు పెంచుతామని కేంద్రం ప్రకటిస్తే, 123 జిల్లాల పరిధిలో గ్యాస్ మౌలిక వసతుల కల్పనకు బిడ్లను ఆహ్వానించింది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు.

CNG vehicles sale will increase
Author
New Delhi, First Published Nov 19, 2018, 12:11 PM IST

ఒకవేళ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో అవసరమైన మౌలిక వసతులు సమకూర్చగలిగితే ప్రతి రెండు కార్లలో ఒకటి సీఎన్జీ వనియోగంలోకి మారనున్నది. దీనివల్ల మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ లబ్ధి పొందనున్నాయి. వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 10వేల సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు ఇటీవలే విడుదల చేసిన సహజవాయువు మౌలిక వసతుల అభివ్రుద్ధి ప్రణాళికలో కేంద్రం తెలిపింది. దీనికి తోడు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) దేశంలోని 124 జిల్లాల పరిధిలో సీఎన్జీ మౌలిక వసతుల విస్తరణకు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కోసం 10వ విడత బిడ్లను ఆహ్వానించింది. 

2030 నాటికి విక్రయించే వాహనాల్లో 50 శాతం సహజవాయువు వాహనాలై ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ‘నొమురా’ పేర్కొంది. తద్వారా ముడి చమురు దిగుమతి నుంచి రూ.11 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతాయని నొమురా అంచనా వేసింది. 

ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా మాత్రమే దేశంలో సీఎన్జీ గ్యాస్ వినియోగ వాహనాలను విక్రయిస్తున్నాయి. కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలోనే 50 శాతం అంటే 55 వేలకు పైగా సీఎన్జీ వినియోగ కార్లు అమ్ముడు పోయాయి. 

సీఎన్జీ కార్లలో హ్యుండాయ్ మోటార్లకు అత్యధిక డిమాండ్ వినిపిస్తోంది. అందునా హ్యుండాయ్ శాంత్రో చిన్న కారు కావడంతో అత్యధికులు ఇష్ట పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పోలిస్తే సీఎన్జీ వినియోగ కార్ల ధరలు తక్కువ కావడం దానికి సానుకూలంగా ఉన్నా.. తమకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ విస్తరించక పోవడమే ఇబ్బందికరంగా పరిణమించిందన్నారు. 

సీఎన్జీ వాహనాలు ఢిల్లీతోపాటు దేశ రాజధాని పరిసరాలు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలాఖరు నాటికి 1424 సీఎన్జీ స్టేషన్లు విస్తరించాయి. అఫ్ కోర్స్ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందనుకోండి. అది వేరే సంగతి. 

ఇక సహజవాయువు మౌలిక వసతుల అభివ్రుద్ధి ప్రణాళిక అమలులోకి తేవడంతో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని నొమురా పేర్కొంది. త్రీ వీలర్, లైట్ వెయిట్ వెహికల్ డ్రైవర్లు కూడా సీఎన్జీ వైపు మళ్లుతున్నారు. దీనివల్ల వారి ఆదాయం నెలకు రూ. 5,000-8000’ అదనంగా పొందుతారు. కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలోని కార్లకు ఇంటర్నల్‌గా కంబుష్టన్ ఇంజిన్ డ్రైవర్ కార్లు, త్రీ వీలర్లు, లైట్ కమర్షియల్ వెహికల్స్‌‌కు వయాబుల్ గా ఉంటుందని తెలిపారు.

భారీ వాహనాల్లో, ట్రక్కుల్లో అధిక మోతాదులో గ్యాస్ నిల్వకు అవకాశం ఉండదు. కనుక దీనికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. దేశంలో సీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎన్జీ మౌలిక వసతుల కల్పనకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అలా వచ్చే సంస్థల ప్రాజెక్టులకు ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని నొమురా తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios