Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి బీఎండబ్ల్యూ న్యూ‘ఎక్స్‌5’:ఆడి, బెంజ్, జాగ్వార్ సహా పలు సంస్థలకు సవాల్

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ మార్కెట్లోకి నూతన తరం ఎక్స్5 కారును తీసుకొచ్చింది. ఆడి, బెంజ్, వోల్వో, జాగ్వార్ తదితర కార్ల తయారీ సంస్థలకు ఈ కారు పోటీగా మారుతుందని భావిస్తున్నారు. డీజిల్ వేరియంట్ కారు 6.5 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకుంటే.. ఈ ఏడాది చివరిలో రోడ్డెక్కనున్న పెట్రోల్ వేరియంట్ కారు 5.5 సెకన్లలోనే ఆ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ధర రూ.72.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 
BMW launches new X5 at Rs 72.90 lakh
Author
Mumbai, First Published May 17, 2019, 10:22 AM IST
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మరో కొత్త కారు భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ న్యూ జనరేషన్‌ ఎక్స్‌5 ఎస్‌యూవీని గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 72.9లక్షలుగా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. 

ఈ కారును బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌-క్రిస్టియన్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెండూల్కర్‌ కలిసి విడుదల చేశారు. దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల మోడళ్లలో బీఎండబ్ల్యూ ఎక్స్‌5 ఒకటి. 

ఇక తాజాగా బీఎండబ్ల్యూ విడుదల చేసిన నూతన తరం ఎక్స్5 మోడల్ కారు.. బెంజ్‌ జీఎల్‌ఈ, వోల్వో ఎక్స్‌సీ90, రేంజ్‌రోవర్‌ వెలార్‌, పోర్షే కయెన్నీ, ఆడీ క్యూ7తో పోటీపడనుంది. గత వెర్షన్‌ మాదిరిగానే ఎక్స్‌5 న్యూ జనరేషన్‌ కారు కూడా భారత వినియోగదారులను ఆకట్టుకుంటుందని హన్స్‌ క్రిస్టియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

2018లో బీఎండబ్ల్యూ 11,105 యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2017లో విక్రయించిన 9,800 యూనిట్లతో పోలిస్తే ఇది 13శాతం అధికం. కార్లతో పాటు బీఎండబ్ల్యూ బ్రాండ్‌ నుంచి బైక్‌లకు మంచి ఆదరణే లభిస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో కంపెనీకి చెందిన ద్విచక్రవాహనాల విభాగం 597 బైక్‌లను విక్రయించింది. 

పూర్తిగా దేశీయంగా తయారవుతున్న బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కారు రెండు డీజిల్ మోడళ్లలో వినియోగదారులకు లభిస్తుంది. ఎక్స్ డ్రైవ్ 30డీ స్పోర్ట్, ఎక్స్ డ్రైవ్ 30డీ ఎక్స్ లైన్ మోడల్  కార్లు డీజిల్ వేరియంట్లుగా లభిస్తాయి. ఇక ఈ ఏడాది చివరిలో పెట్రోల్ వేరియంట్ బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎక్స్ డ్రైవ్ 40ఐ ఎం స్పోర్ట్ కారు అందుబాటులోకి వస్తుంది. 

కాకపోతే ఎక్స్ డ్రైవ్ 30డీ ఎక్స్ లైన్, ఎక్స్ డ్రైవ్ 40ఐ ఎం స్పోర్ట్ కారు ధర రూ.82.40 లక్షలుగా ఉంటుందని తెలిపింది. 3 లీటర్స్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ గల ఎక్స్ 5 ఎక్స్ డ్రైవ్ 30 డీ కారు  195 కిలోవాట్లు/ 265 హెచ్పీ, 1500-2500 ఆర్పీఎం వద్ద అత్యధికంగా 620 ఎన్ఎం శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 6.5 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం ఈ కారు స్పెషాలిటీ. 

బీఎస్ -6 ప్రమాణాలతో తయారైన బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ 40ఐ పెట్రోల్ వేరియంట్ కారు 3 లీటర్స్ 6 సిలిండర్ సామర్థ్యం గల ఇంజిన్ కలిగి ఉంటుంది. 340 హెచ్పీ వద్ద 250 కిలోవాట్లు, 1500- 5200 ఆర్పీఎం వద్ద గరిష్ఠంగా 450 ఆర్పీఎం టార్చి జారీ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ కారు 5.5 సెకన్లలోనే 100 కి.మీ. వేగం అందుకుంటుంది. 

ఐ డ్రైవ్ కంట్రోల్ వీల్, ఆడియో కంట్రోల్ బటన్, స్టార్ట్ లేదా స్టాప్ బటన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ స్కై లాంజ్, ఎల్ఈడీ లైట్ గ్రాఫిక్స్, లైట్ కార్పెట్, 40:20:40 స్ప్లిట్ రేర్ సీట్ బ్యాక్ రెస్ట్.. 650 లీటర్ల నుంచి 1870 లీటర్ల బూట్ కెపాసిటీ కలిగి ఉంటుంది. గెస్టర్ కంట్రోల్, డిస్ ప్లే కీ, వైర్ లైస్ చార్జింగ్, హెడ్ అప్ డిస్ ప్లే, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టెడ్ డ్రైవ్ టెక్నాలజీస్ ఈ కారులో లభిస్తాయి. 
Follow Us:
Download App:
  • android
  • ios