Asianet News TeluguAsianet News Telugu

గాలి లేని టైర్లతో... త్వరలో మార్కెట్లోకి 3డీ ప్రింటెడ్ బైక్

బిగ్ రెప్స్ సహకారంతో త్వరలో మార్కెట్లోకి నూతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 3డీ ప్రింటెడ్ మోటార్ బైక్ రానున్నది. గాలి లేని టైర్లతో నడిచే ఈ బైక్ బరువు 60 కిలోలే ఉంటుంది.

BigRep's 3D Printed Electronic Motorcycle Should Be on Your Christmas List
Author
Mumbai, First Published Nov 28, 2018, 12:14 PM IST

జర్మన్‌ 3డీ ప్రింటింగ్‌ దిగ్గజం బిగ్‌రెప్‌ సంస్థ ‘3డీ ప్రింటెడ్‌ నెరా ఈ-బైక్’ను మార్కెట్లోకి తీసుకు రానున్నది. తొలిసారిగా ఈ సాంకేతికతను మోటార్‌ సైకిల్‌ విభాగంలో వినియోగిస్తుండటం విశేషం.

విద్యుత్‌ విడిభాగాలు, బ్యాటరీ తప్పితే ఇందులోని మిగతా భాగాలైన టైర్లు, రిమ్ములు, ఫ్రేమ్‌, ఫోర్క్‌, సీటు 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో రూపొందించినట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గాలి లేని టైర్లు దీని ప్రత్యేకత. దీనికి ‘నెరా ఈ - బైక్’ అని నామకరణం చేశారు. వచ్చే క్రిస్మస్ నాటికి రోడ్లెక్కనున్నదని భావిస్తున్నారు. 3డీ ప్రింటింగ్ విధానంలో ఈ బైక్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నది. 

బైక్ బరువు 132 పౌండ్లు (సుమారు 60 కిలోలు) ఉంటుంది. హోండా మెట్రోపాలిటన్‌ స్కూటర్‌ కంటే కూడా ఇది 50 పౌండ్లు బరువు తక్కువగా ఉండబోతోంది. ఒకసారి ఛార్జీ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు? అధికారికంగా ఈ-బైక్‌ను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు?

తదితర వివరాల్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది. తక్కువ పరిమాణంలో బైక్‌లు ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు సమయం, ఖర్చు తగ్గించుకోవడానికి ఈ 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

పూర్తిగా ప్రొటోటైప్ ఫంక్షనింగ్‌తో పని చేసే ‘నెరా ఈ - బైక్’ పూర్తిగా ఎలక్ట్రిక్ వినియోగంతోనే నడువనున్నది. పూర్తిగా ఇన్నోవేషన్‌, టెక్నాలజీలో సమూల మార్పులతో స్రుష్టించిన ఆవిష్కరణే ఈ బైక్. మాక్సిమిలియన్ సెడ్లాక్, మార్కో మాటియా క్రిస్టోఫోరిల సంయుక్త ఆధ్వర్యంలోని బిగ్ రేప్ సంస్థ సహకారంతో ‘నెరా ఈ - బైక్’ రూపుదిద్దుకున్నది.

ఈ మోడల్ బైక్ విజయవంతమైతే సమీప భవిష్యత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ యావత్తు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ వైపు మళ్లుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నోవేటర్లు తమ ఇంటి వద్ద నుంచే 3డీ ప్రింటెడ్ కార్లు, మోటారు సైకిళ్లు డిజైన్ చేయొచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios