Asianet News TeluguAsianet News Telugu

హోండా యాక్టీవా 6జీకి బజాజ్ ‘అర్బనైట్’చాలెంజ్: త్వరలో విపణిలోకి..

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బజాజ్ ఆటోమొబైల్ విపణిలోకి స్కూటర్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అర్బనైట్ పేరుతో అభివ్రుద్ధి చేసిన ఈ స్కూటర్లు విద్యుత్ ఆధారితంగా పని చేయడంతోపాటు హోండా యాక్టీవా 6జీకి గట్టి పోటీ ఇస్తాయని చెబుతున్నారు. 

Bajaj Urbanite scooter spotted testing once again
Author
New Delhi, First Published May 27, 2019, 1:29 PM IST

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ మళ్లీ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. విపణిలోకి ఇటీవలే ఫోర్ వీలర్ వాహనాలను విడుదల చేసిన బజాజ్ ఈ ఏడాది చివరికల్లా స్కూటర్లను తిరిగి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. 

తాజాగా, ఆ సంస్థ అభివృద్ధి చేసిన ‘అర్బనైట్’ స్కూటర్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన దీనిని దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్లోనూ విడుదల చేయాలని భావిస్తోంది.
 
‘అర్బనైట్’ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ట్విన్ స్లంటింగ్ టెయిల్ ల్యాంప్స్, వెడల్పాటి సీటు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్, ఫోల్డబుల్ రియర్ ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కర్వీ ఫ్రంట్ ప్రొఫైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్, సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
హోండా యాక్టివా 6జీకి ‘అర్బనైట్’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ స్కూటర్‌లో ఈ-సిమ్ ఎంబెడెడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు.

‘అర్బనైట్’ ద్వారా బ్యాటరీ, రైడ్ వివరాలు, లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు, యాప్ సాయంతోనూ స్కూటర్ కండిషన్‌ను తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

బజాజ్ తన ఐకానిక్ ‘చేతక్’ మోడల్ డిజైన్‌తోనే ఈ స్కూటర్లను డిజైన్ చేస్తోంది. కర్వీ అండ్ స్టౌట్ బాడీ ప్యానెల్స్‌తో వెంటనే ‘అర్బనైట్’ స్కూటర్ ను గుర్తు పట్టొచ్చు. హ్యాండిల్ బార్ మౌంటెడ్ హెడ్ ల్యాంప్ (ఎల్ఈడీ) ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్, వెస్పా మోడల్ కు సమాంతరంగా ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రావచ్చు. 

12 - అంగుళాల అల్లాయ్ వీల్స్ , ఫ్రంట్ డిస్క్ ఉంటుంది. ఓల్డ్ స్కూల్ స్టైలింగ్ లో ఉన్నా ఈ ‘అర్బనైట్’ స్కూటర్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ గా ఉంటుంది. సంప్రదాయ స్కూటర్లకు బదులు విద్యుత్ ఆధారిత స్కూటర్లను ‘అర్బనైట్’ బ్రాండ్లలో విపణిలోకి విడుదల చేయాలని బజాజ్ ఆటోమొబైల్ భావిస్తోంది. 

ఈ ఏడాది త్రుతీయార్థంలో విపణిలోకి అడుగు పెట్టనున్న ‘అర్బనైట్’ స్కూటర్ ను తొలుత పరిమితంగా విడుదల చేస్తూ క్రమంగా భారీ స్థాయిలో రిటైల్ విక్రయాల దిశగా విస్తరించాలని బజాజ్ ఆటోమొబైల్స్ భావిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios