Asianet News TeluguAsianet News Telugu

స్పోర్ట్స్ అప్పీల్‌తో మార్కెట్లోకి బజాజ్ పల్సర్ నియాన్

ఆటోమొబైల్ మేజర్ బజాజ్ సరికొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. న్యూ పల్సర్ 150 నియాన్ బైక్ స్పోర్ట్స్ అప్పీల్‌గా ఉంటుంది. కొత్త మోడల్ బైక్ కొనాలని భావించే వినియోగదారులకు పల్సర్ నియాన్ 150 సరైందని బజాజ్ పేర్కొంది.

Bajaj drives in new Pulsar 150 Neon at Rs 64,998
Author
New Delhi, First Published Nov 30, 2018, 11:49 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ మేజర్ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సరికొత్త పల్సర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్‌ 150 నియాన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.64,998గా కంపెనీ నిర్ణయించింది. నియాన్‌లో సరికొత్త హెడ్‌ల్యాంప్‌ బ్రౌస్‌, బ్యాడ్జెస్‌, సైడ్‌ప్యానెల్‌ మెష్‌, గ్రాబ్‌ రెయిల్‌ తదితరాలు అమర్చారు. ‘100 సీసీ, 110 సీసీ దాటి మరో సెగ్మెంట్‌లో వాహనం కొనాలనుకునే వినియోగదారులకు నియాన్‌ ఒక మంచి ఎంపిక’ అని బజాజ్‌ ఆటో మోటార్‌ సైకిల్‌ విభాగం అధ్యక్షుడు ఎరిక్‌ వాజ్‌ తెలిపారు.

నియాన్‌లో 149సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8000 ఆర్‌పీఎం వద్ద 14బీహెచ్‌పీ శక్తిని, 13.4ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ముందుభాగంలో 240 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌, వెనుక చక్రానికి 130 ఎంఎం డ్రమ్‌ బ్రేక్‌ను అమర్చారు. ఈ వాహనంలో ఏబీఎస్‌ వ్యవస్థ మినహా సంప్రదాయ పల్సర్‌ డిజైన్‌ పోలి ఉంటాయి. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నదని బజాజ్ పేర్కొంది. ఇప్పటికే పల్సన్ అద్భుతమైన పనితీరు మెప్పించిందని బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ విభాగం అధ్యక్షుడు ఎరిక్ వాన్ తెలిపారు. కొత్త స్పోర్టీ లుక్ వినియోగదారులకు నచ్చుతుందని బజాజ్ భావిస్తున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios