Asianet News TeluguAsianet News Telugu

అప్రిలియా ఆర్‌ఎస్ 660 : సూపర్‌ స్పోర్ట్ క్లాస్‌ బైక్

100 బిహెచ్‌పి పారలాల్-ట్విన్ ఇంజన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో కొత్త ఉత్సాహం కోసం ఈ సూపర్‌స్పోర్ట్ క్లాస్‌ అప్రిలియా ఆర్‌ఎస్ 660 EICMA 2019 లో అడుగుపెట్టింది.

Aprilia RS 660 Unveiled in EICMA 2019 debut
Author
Hyderabad, First Published Nov 7, 2019, 12:37 PM IST

ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2019 మోటార్‌సైకిల్ ప్రదర్శనలో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్రిలియా సూపర్‌స్పోర్ట్ - RS 660 ను  ఆవిష్కరించింది. కొత్త ఆర్‌ఎస్ 660 ఆల్-న్యూ 660 సిసి, యూరో 5 కంప్లైంట్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

also read  బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్ : KTM 390 అడ్వెంచర్ 2020

ఇది 100 బిహెచ్‌పి పవర్ ని ఉత్పత్తి చేస్తుంది,  దీనిఆర్‌పిఎమ్ మరియు పీక్ టార్క్ వంటి విషయాలు విడుదల కాలేదు. ఈ బైక్ ఇంజన్ 1100 సిసి అప్రిలియా ఆర్‌ఎస్‌వి 4 పవర్‌ప్లాంట్ అనుగుణంగా తయారుచేశారు. ఇది 270-డిగ్రీల క్రాంక్ షాఫ్ట్ డిజైన్‌ను మరియు బైక్ ఆరు-ఆక్సీస్  ఇంటిరియల్ మెజర్మెంట్ (IMU) చేత సరికొత్త ఎలక్ట్రానిక్స్‌తో లోడ్ చేయబడింది.

Aprilia RS 660 Unveiled in EICMA 2019 debut

అప్రిలియా RS 660లో  ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, 5 రైడింగ్ మోడ్లు (స్ట్రీట్స్ మోడ్ లో 3 రకాలు, రోడ్  ట్రాక్ కోసం 2 రకాలు), అప్ / డౌన్ క్విక్‌  షిఫ్టర్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది.  RS 660 కూడా స్టాండర్డ్  క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది బైక్  బరువు కేవలం 168 కిలోలు.

కొత్త ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ ఇంజిన్‌ ఒత్తిడిని తట్టుకుంటుంది. అల్యూమినియం స్వింగార్మ్‌ కుడ  కలిగి ఉంటుంది. ఇది RSV4 వలె వెనుక షాక్ మౌంటును అమర్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ పూర్తిగా అడ్జస్ట్ చేయగల 41mm కయాబా ఫోర్క్ చేత పనిచేస్తుంది. అయితే బ్రేకింగ్ విషయంలో ఫ్రంట్ వీల్‌లో డ్యూయల్ 320mm డిస్క్‌లతో  బ్రెంబో కాలిపర్స్ చేత పనిచేస్తుంది.

Aprilia RS 660 Unveiled in EICMA 2019 debut

ఈ డిజైన్ RSV4 సూపర్‌బైక్‌తో పోలిక  ఉంటుంది.  బైక్‌ అధిక వేగంతో ఉన్నపుడు బైక్ స్థిరంగా ఉంచడానికి డౌన్‌ఫోర్స్‌ను పెంచుతుందని అదనపు  ఔటర్ ఫెయిరింగ్‌తో డబుల్ ఫెయిరింగ్ కలిగి ఉంది. RS 660 లో LED లైటింగ్, డే టైమ్ రన్నింగ్ లైట్లు, అలాగే సెల్ఫ్-ఆఫ్ టర్న్ ఇండికేటర్లు, కార్నరింగ్ లైట్లు ఉన్నాయి.

also read మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం

అప్రిలియా RS 660 5-అంగుళాల, ఫుల్ కలర్ TFT డాష్‌ను కలిగి ఉంది. దీనిలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వివిధ ఎలక్ట్రానిక్   ఇండికేషన్స్  రైడర్ కి సులభంగా నావిగేషన్ చేయడానికి  కొత్త ఫీచర్స్ ఇందులో అమర్చారు. అప్రిలియా కొత్త ఆర్ఎస్ 660  ధర, వివరాలు, లభ్యత పై ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు

Follow Us:
Download App:
  • android
  • ios