Asianet News TeluguAsianet News Telugu

ఎస్!! 8 ఏళ్ల కనిష్టానికి: ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ..

ఎన్నికల ఫలితాలు.. ద్రవ్య లభ్యతలో సంక్లిష్టత తదితర అంశాలు ఏప్రిల్ నెల ప్రయాణికుల వాహనాలు 17 శాతం తగ్గాయి. ఇది సరిగ్గా ఏడున్నరేళ్ల కనిష్టానికి సమానం. 
 

17% dip in April: Passenger vehicle sales drop most in seven and half years
Author
New Delhi, First Published May 14, 2019, 10:30 AM IST

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణికుల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే, ఈ ఏడాది ఏప్రిల్‌లో 17.07 శాతం తగ్గుముఖం పట్టాయి. 2011 అక్టోబర్ తర్వాత అంటే ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్థాయి క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారి. 

రుణాల లభ్యత తక్కువగా ఉండడం, ఎన్నికల వల్ల ఏర్పడ్డ అనిశ్చితి, ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో వినియోగదారు సెంటిమెంటు బలహీనపడడం ఇందుకు నేపథ్యం. దీంతో దేశీయ విక్రయాలు వరుసగా ఆరో నెలా తగ్గి ఏప్రిల్‌లో 2,47,541 వాహనాలకు పరిమితమయ్యాయి.

2018 ఇదే నెలలో 2,98,504 వాహనాలు అమ్ముడయ్యాయి. అన్ని వాహన విభాగాలు (ద్విచక్ర, వాణిజ్య వాహనాలతో కలిపి) ఏప్రిల్‌ అమ్మకాల్లో క్షీణత చవిచూశాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

దేశీయంగా కార్ల విక్రయాలు 19.93% తగ్గి 1,60,279కు, మోటార్‌ వాహనాల విక్రయాలు 11.81% కిందకు వచ్చి 10,84,811కు పరిమితమయ్యాయి. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మోకాలు ఏప్రిల్‌లో 16.36% క్షీణించి 16,38,388కు చేరాయి. 

వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా 5.98 తగ్గి 68,680కు పరిమితం అయ్యాయి. వివిధ క్యాటగిరీల వాహనాల సేల్స్ 15.93 శాతం తగ్గిపోయాయి. గతేడాది ఏప్రిల్ నెలలో 23,80,294 వాహనాలను విక్రయిస్తే ఈ ఏడాది 20,01,096 వెహికిల్స్ అమ్ముడయ్యాయి. 

మార్చి నెలాఖరుతో ముగిసిన చివరి మూడు నెలల్లోనే దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్ మారుతి సుజుకి 4,58,479 కార్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 0.7 శాతం తక్కువ. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ అంచనాలను మారుతి సుజుకి తగ్గించి వేసుకున్నది. 

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాహనాల విక్రయాల్లో కొంత రికవరీ సాధించగలమన్నారు. టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్‌లో 22 శాతం తగ్గిపోయాయి. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) 79,923 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇందులో గ్లోబల్ సేల్స్ 35,451 యూనిట్లు. 

టాటా కమర్షియల్ వెహికల్స్, టాటా డాయెవో రేంజ్ సేల్స్ గతేడాదితో 20 శాతం తగ్గి 31,726 యూనిట్లకు చేరాయి. గ్లోబల్ హోల్ సేల్స్ విక్రయాలు 23 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ గ్లోబల్ విక్రయాలు 48,197 యూనిట్లు జరిగాయి. గత నెలలో జాగ్వార్ లాండ్ రోవర్ సేల్స్ 13,301 యూనిట్లు అమ్ముడయ్యాయి. లాండ్ రోవర్ సేల్స్ 22,150 యూనిట్లు అమ్ముడయ్యాయని సియామ్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios