Asianet News TeluguAsianet News Telugu

ధనత్రయోదశి.. శని త్రయోదశి.. బంగారం కొనకూడదా..?

వ్యాపార సంస్కృతిలో పడిపోయి ఇవి అన్నీ వచ్చాయి కాని మన సంస్కృతిలో లేవు. ఉన్న ధనాన్ని పదిమందికి పంచుకోవాలని చెప్పే విధానం మాత్రమే మన భారతీయుల సంప్రదాయంలో ఉన్నది. వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఏవో మాటలు చెపితే వాటిని అన్నీ విని మోసపోతున్నారు.

why people buy gold on Dhanteras?
Author
Hyderabad, First Published Oct 26, 2019, 1:21 PM IST

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా పిలుస్తారు. ఈ ధనత్రయోదశి గుజరాతీలకు మహారాష్ట్రులకు సంబంధించిన పండుగ. ఇది రాను రాను మన ప్రాంతానికి వ్యాప్తి చెందినది.

ఈ రోజున ఇళ్ళను, వాకిళ్ళను శుభ్రం చేసుకొని, అలికి, ముగ్గులు వేసి రంగు రంగులు వేసి అందంగా అలంకరించు కుంటారు. శుచిగా, శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందని వారి నమ్మకం. ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను, వెండి వస్తువులను శుభ్రం చేసి పూజ చేయాలని మాత్రమే చెప్పారు కాని ఆ రోజున కొత్తగా బంగారు వస్తువులు కొనమని ఎక్కడా చెప్పలేదు. ఇది గుజరాతీయుల సంప్రదాయం.

వ్యాపార సంస్కృతిలో పడిపోయి ఇవి అన్నీ వచ్చాయి కాని మన సంస్కృతిలో లేవు. ఉన్న ధనాన్ని పదిమందికి పంచుకోవాలని చెప్పే విధానం మాత్రమే మన భారతీయుల సంప్రదాయంలో ఉన్నది. వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఏవో మాటలు చెపితే వాటిని అన్నీ విని మోసపోతున్నారు.

ఎవరైనా అమావాస్య ముందు రోజుల్లో సాధారణంగా కొత్త వస్తువులు కొంటారా? మన దగ్గర అసలు కొననే కొనరు. అలాగే అమావాస్య రోజున కొత్త వస్తువులకు పూజ చేయడం వాటిని ధరించడం లేనే లేదు.

ప్రస్తుత కాలంలో సమాజంలో అందరివద్ద డబ్బులు అధికంగా అయి, అందరూ వ్యాపార సంస్కృతికి అలవాటు పడి వ్యాపారస్తులు చెప్పిన మాటలు విని వ్యాపారస్తులను పెంచి, పోషిస్తున్నారు. ఆరోజున ఎంత ధర ఉన్నా ఎంతో కొంత బంగారం కొనాలని వారు చెప్పే వ్యాపార ప్రకటనలు చూసి మోసపోతున్నారు.

 

భారతీయ సంస్కృతి విధి విధానం ప్రకారం ఆలోచించిన ఈ రోజున ఎంత ఎక్కువ ధనం దానం చేస్తే అంత మంచిది. కొన్న వస్తువులను కూడా దానం చేయాలి. ఈ విషయం ఎవరికీ అర్థం కాదు. లక్ష్మీ దేవిని తమ దగ్గర ఉంచుకోవడం కాదు. నలుగురికీ పంచితే తమకు పెరుగుతుంది. నలుగురికీ ధనాన్ని పంచడం వలన తమకు పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరగడం వలన తమకు అవసరమైన పనులు అవసరమైన సమయానికి పూర్తి అవుతాయి. మానవులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది?

ఈ నెల 26వ తేదీ శని త్రయోదశి, ధన త్రయోదశి రెండూ ఒకే రోజున వస్తున్నాయి. ఆ రోజున మాస శివరాత్రి కూడా ఉన్నది. ఈ రోజున చాలా శుభదినము. ధన త్రయోదశి రోజున చేసే దానాలు, జపాలు విశేష ఫలితాన్నిస్తాయని మన పెద్దలు చెపుతున్నారు. ఈ సం||రం ఈ రోజున శని త్రయోదశి కూడా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఇలాటి రోజున శనీశ్వరునికి పూజ చేయడం వలన అక్షయమైన ఫలితాన్ని పొందవచ్చు.

ఏలినాటిశని : వృశ్చికరాశి వారు, ధనుస్సురాశివారు, మకర రాశివారికి ఏలినాటి జరుగుతున్నందున ఈ రాశుల వారు ఈ రోజు విశేషమైన దానాలు చేయడం మంచిది.

అష్టమశని :  వృషభం, కన్య రాశుల వారికి అర్ధాష్టమశని ప్రభావం ఏర్పడుతున్నది. కావున వీరు కూడా దానాలు అధికంగా చేయాలి.

ఏలినాటి శని, అష్టమ శని ఉన్న రాశులవారు ఈ రోజున దాన, జపాలు చేయడం వలన ఎక్కువ అనగా అక్షయమైన ఫలితాన్ని పొందగలరు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios