Asianet News TeluguAsianet News Telugu

17డిసెంబర్ 2018 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 17thdec2018 your horoscope
Author
Hyderabad, First Published Dec 17, 2018, 9:26 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. లాభనష్టాలు అనుకూలంగా ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పనులలో ఒత్తిడి ఉన్నా చివరకు సంతోషం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యాపారస్తుకు అనుకూల సమయం. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. నూతన పరిచయాలు అనుకూలం. భాగస్వాములకు సంతోషకర వాతావరణం. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది. పరస్పర సహకారం లభిస్తుంది. అనుకూలత పెరుగుతుంది. శ్రీ మాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది.వృత్తి విద్యల వల్ల సంతోషం ఏర్పడుతుది. శతృవులపై విజయం సాధిస్తారు. పోీల్లో గెలుపు సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నం చేయాలి. సంతాన సంబంధ ఆలోచనల్లో శ్రమ, ఒత్తిడి ఉంటాయి.. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. పరిపాలన సమర్ధత ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది.  శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆహార సౌకర్యం లభిస్తుంది. ప్రయాణాల్లో సంతోషం ఉంటుంది. వాహన సౌకర్యం లభిస్తుంది. కార్యాలయాల్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. ఆహారం విషయంలో సమయ పాలన అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వ్యాపారస్తుల వల్ల సహకారం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రచనలపై ఆసక్తి ఉంటుంది. తోివారితో సంభాషణలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ అభివృద్ధి చెందుతాయి. పరాక్రమం పెరుగుతుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో అధిక ఫలితాలు సాధిస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాటలవల్ల గౌరవం పెరుగుతుంది. ధనాన్ని పెంచుకునే ప్రయత్నంపై దృష్టి ఉంటుంది. పెట్టుబడులు విస్తరిస్తాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ కొంత ఒత్తిడి కలిగిస్తుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం ఉంటుంది. పనుల్లో అనుకూలత ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. పనులు ఫలిస్తాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. శ్రమానంతరం అధిక ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విహార యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది.  అన్ని రకాల ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఎక్కువఆలోచన ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తెలియని ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన. శ్రీ మాత్రేనమః మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వివిధ వస్తువులపై దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టిగా కృషి చేస్తారు. సమిష్టి ఆదాయాలపై ఆలోచన ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కళాకారులకు అనుకూల సమయం. పెట్టుబడులు విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తి. శ్రీ దత్తశ్శరణం మమ జపంమంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఉద్యోగాదుల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవం ఉంటుంది. సాంఘిక రాజకీయ విషయాలపై చర్చ చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సంప్రదింపుల్లో సంతోషం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. విదేశ వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. గురువులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios