Asianet News TeluguAsianet News Telugu

16అక్టోబర్ 2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల సమస్యలు వచ్చే సూచనలు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవచ్చు. తమను తాము కించపరుచుకునే ప్రయత్నం చేయకూడదు. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి.

today 16th october 2019 your horoscope
Author
Hyderabad, First Published Oct 16, 2019, 7:04 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.పెట్టుబడులపై అధిక శ్రద్ధ చూపుతారు. భాగస్వామ్య సంబంధాలు విస్తరిస్తాయి. తోటివారితో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని సంతోషం లభిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  సంతానం వల్ల సమస్యలు వచ్చే సూచనలు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవచ్చు. తమను తాము కించపరుచుకునే ప్రయత్నం చేయకూడదు. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : గృహ నిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం అవసరం. సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు కొంత ఒత్తిడిన కలిగిస్తాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) :  కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. అధికారిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. వాటికోసం ఆరాటంపెరుగుతుంది. విందువినోదాల్లో పాల్గొటాంరు. ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఇంటిలో సకల మర్యాదలు ఉంటాయి. తల్లి తండ్రులతో అనుకూలత ఏర్పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. ఎక్కువ మౌనం వహించడం మంచిది. దగ్గరి ప్రయాణాలు విస్తరిస్తాయి. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శారీరక శ్రమతో పనులు పూర్తిచేస్తారు. అనుకున్న ఫలితాలు సాధించలేరు. చిత్త చాంచల్యం అధికం. ఆర్థిక నిల్వలపై దృష్టి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుస్తారు. చాకచక్యంతో సమస్యలను పరిష్కరిస్తారు. అందరిలో గుర్తింపు లభిస్తుంది. మన్ననలు పొందుతారు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనుల రూపకల్పన చేస్తారు. శ్రమానంతరం ఫలితాలు ఉంటాయి. సంతృప్తి పెరుగుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మంచిది. విశ్రాంతికై ఆలోచిస్తారు. శ్రమపడకూడదని భావన ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులుఅధికం అవుతాయి. చిత్త చాంచల్యం అధికమౌతుంది. జపం అవసరం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. పెద్దల ఆశీస్సులకై ఆలోచన పెరుగుతుంది కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహించని లాభాలు వస్తాయి. శ్రమలేని సంపాదన ఉంటుంది. అన్ని రకాల ఆదాయాలు ఆనందాన్నిస్తాయి. జపం అవసరం

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతృప్తికై ఆలోచనలు చేస్తారు. అనుకున్న తృప్తి లభించదు. అధికారులతో అప్రమత్తత అవసరం. అధికారిక ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. కొన్ని ఊహించని ఇబ్బందులు ఉన్నా తరువాత సంతోషాన్ని పంచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. చిత్త చాంచల్యం అధికం. విలాసవంతమైన జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనాలనే తపన ఉంటుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాలు విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వాములతో ఒత్తిడి పెరుగుతుంది.  అన్ని పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. పారమర్శలు తప్పకపోవచ్చు. ఊహించని ఆటంకాలు ఎదురౌతాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి పెరుగుతుంది. అనుకోని చిక్కులు వస్తాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios