Asianet News TeluguAsianet News Telugu

13జనవరి 2019 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 13th jan2019 your horoscope
Author
Hyderabad, First Published Jan 13, 2019, 8:15 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) :శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. దూర దృష్టి ఉంటుంది. పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో నిరాశలు ఉంటాయి. శారీరక శ్రమ చేస్తారు. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. లాభనష్టాలు అనుకూలం. ఊహించని ఆదాయం. అనారోగ్య సూచనలు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. లాటరీల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపార ధోరణి పెరుగుతుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. నూతన పరిచయాలు వినియోగపడతాయి. భాగస్వాములతో అప్రమత్తంగా ఉంటారు. వ్యాపార ఆలోచనలు పెరుగుతాయి. పదిమందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఊహించని సంతోషం లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. పనులు సులభతర అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికం. సంతాన సమస్యలు పెరుగుతాయి. చిత్త చాంచల్యంతగ్గుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. అనవసర కష్టాలు తెచ్చుకుటాంరు. సమయాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. కష్టపడాలి. జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యా వల్ల సంతోషం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఊహించని ఆదాయాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తిచేస్తారు. మానసికానందం పెరుగుతుంది. శత్రువులపై జపం సాధిస్తారు. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సహకార లోపం ఉంటుంది. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కమ్యూనికేషన్స్‌ల వల్ల కొత్త ఇబ్బందులు వచ్చే సూచన. విద్యార్థులు జాగ్రత్తపడే సమయం. ప్రచార సాధనాలు సద్వినియోగం కావు. మీడియావారికి ఒత్తిడి ఉంటుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నూతన ఆదాయం వచ్చే సూచనలు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. వాక్‌చాతుర్యం పెరుగుతుంది. సంతృప్తికర వాతావరం ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక సమస్యలు ఉంటాయి. శ్రమ అధికం చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. పనుల్లో ప్రణాళికలు అవసరం. కార్య సాధనలో పట్టుదల అవసరం. స్ఫురణ శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. నరాల సంబంధ నొప్పులు వచ్చే సూచన. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి, వ్యాపార ప్రయాణాలపై ఆలోచనలు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విశ్రాంతి లోపం ఉంటుంది. నిద్రాభంగం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ఆలోచనల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సమయం సద్వినియోగం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళాకారులకు అనుకూలసమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సంతృప్తి ఉంటుంది. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది.. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చేసే వృత్తులో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూల సమయం. పనులు పూర్తి అవుతాయి. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios