Asianet News TeluguAsianet News Telugu

నవంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this november month horoscope is here
Author
Hyderabad, First Published Nov 1, 2018, 10:15 AM IST

1.మేషం : ఈ రాశి వారికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమంగ ఉండును. రెండవ వారం నుండి వీరికి ఆర్ధిక లాభాలు, సోదర సహకారం బాగుండును. గృహ, కుటుంబ విషయాలు సామాన్యంగ ఉండును. ఆరోగ్య విషయంలో  శ్రద్ధ అవసరం. ఆహారంలో సమయపాలన అవసరం. ఆకస్మిక ధన లాభం సూచితం. వీరు 8,9,10 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిద మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన శ్రేయస్కరం.

2. వృషభం : ఈ రాశి వారికి గోచర గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వీరికి జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. వీరికి పొటీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉంటాయి. సమాజిక సంబంధాల విషయంలో గౌరవ ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. గృహ, కుటుంబ విషయాలలో అపార్ధాలు రాకుండా చూసుకోవాలి. వీరు 10,11,12 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి శివారాధన, లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన చేసికొనుట శ్రేయస్కరం. 

3. మిధునం :  ఈ రాశి వారికి గోచర గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. ద్వితీయార్ధంలో పొటీ రంగంలో విజయావకశాలు అధికంగా ఉంటాయి. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వతావరణం నెలకొనును. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయము. వృత్తి, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త అవసరం. 13,14,15 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా వేయుట మంచిది. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యారాధన, దత్తత్రేయ స్తోత్ర పారాయన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

4. కర్కాటకం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఈ రాశి వారికి పొటీ రంగంలో విజయావశాలు అధికముగా ఉండును. సంతాన వర్గ అభివద్ధి  ఆనందదాయకంగా ఉండును. ఆరోగ్య విషయములో  శ్రద్ధ అవసరం.  16,17 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

5. సింహం : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. ప్రధమార్ధంలో జనహకారం ప్రయొజనకరంగ ఉండును. విద్యార్ధులకు అనుకూల సమయం. పొటిరంగంలో విజయావకాశాలు అధికం. గృహ కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం ఉంటుంది. దూరప్రయాణాలకు అవకాసమున్నది. 18, 19, 20 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరు సుబ్రహ్మణ్యారాధన, దుర్గాస్తోత్ర పారాయణ, శివారాధన చేసిన మంచిది.

6. కన్య : ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. ద్వితీయార్ధంలో జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. పొటీరంగములో  విజయావకాశములు అధికంగా ఉంటాయి. గృహ, కుటుంబ విషయాలలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. పెద్దలనుండి సహాయ సహకారములు లభిస్తాయి. విద్యార్ధులు అధిక శ్రమతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు.  21,22 తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా వేయుట మంచిది. వీరికి విష్ణ్వారాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన శ్రేయస్కరం.

7. తుల : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.  గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం ఉంటుంది. మాట విలువ పెరుగును.  సేవక జనసహకారం ప్రయోజనకరంగా ఉండును.  ఆహార విషయంలో సమయ పాలన పాటించాలి. సంతాన వర్గం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనలాభము సూచితము. 23, 24 తేదీలలో ముఖ్య నిర్ణయా వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దుర్గస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

8. వృశ్చికం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. ప్రధమార్ధములో సోదర సహకారం బాగా లభించును. గృహ, కుటుంబ విషయాలలో స్నేహపూర్వక వాతావరణం నెలకొనును. ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్త అవసరము. వీరికి జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. దూర ప్రయాణాలకు అవకాశమున్నది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. విద్యార్ధులకు శ్రమ అధికం. 25,26 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా.  ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, దత్తత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన ,విష్ణ్వారాధన శ్రేయస్కరం.

9. ధనుస్సు : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. సోదర సహకారం ప్రయోజనకరంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. వీరు దానధర్మములకై ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరికి వృత్తి, ఉద్యోగాలలో ఏకాగ్రత  అవసరం . ఇతరులతో మ్లాడునప్పుడు  జాగ్రత్తగా వ్యవహరించాలి.ఆరోగ్య విషయములో శ్రద్ధ అవసరము. 27,28 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి విష్ణ్వారాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

10. మకరం: ఈ రాశి వారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతి, ఆర్ధిక లాభాలు చేకూరును. వీరికి విద్యా విషయంలో అనుకూల వాతావరణం సూచితం. పెద్దలనుండి చక్కని సహాయ సహకారములు లభించును. సంతాన వర్గ ఉన్నతి ఆనందప్రదంగ ఉండును. ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్తగ  అవసరం. 29,30 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది.వీరికి సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

11. కుంభం : ఈ రాశి వారికి గోచరగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. ద్వితీయార్ధములో వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి సూచితమౌతున్నది. గృహ, కుటుంబ విషయాలలో  ఆనందప్రద వాతావరణం నెలకొనును. వీరికి పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. సేవక జనసహకారం లాభసాటిగా ఉండును. ఆధ్యాత్మిక చింతన పెంపొందును.  4,5 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

12. మీనం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పెద్దల నుండి సహాయసహకారములు లభించును. ప్రధమార్ధములో ఆర్ధిక పరిస్థితి అనుకూలముగ ఉండును.  ఆధ్యాత్మికతచింతన  ఎక్కువగ  ఉండును.ఆరొగ్య విషయంలో శ్రద్ధ అవసరము. సంతాన వర్గ అభివృద్ధి ఆనందప్రదముగ ఉండును. 6,7,8తేదీల్లో ముఖ్యమైన నిర్ణయములను వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయస్తోత్ర పారాయణ, విష్ణ్వారాధన, లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ శ్రేయస్కరము.          

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios