Asianet News TeluguAsianet News Telugu

నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా..?

మాకు జాతకం వివరాలు పంపిన కొందరు జాతక సమస్యలకు పరిష్కాలు ఇక్కడ ఉన్నాయి. 

problems in jathakam and sollution is here
Author
Hyderabad, First Published Feb 8, 2019, 12:38 PM IST

1. వెంకటరామయ్య

ప్రస్తుతం ఎలా ఉంది? ఆరోగ్య దోషాలు ఉన్నాయా?

జాతకరీత్యా అనారోగ్య దోషాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అదే దశ  నడుస్తున్నందున దాని ప్రభావం అధికంగా ఉంటుంది. 11.8.2019 నుండి ఒకరకంగా 2020 సెప్టెంబర్‌ తర్వాత మరిక రకంగా ఇబ్బంది తప్పనిసరిగా ఉంటుంది. దాన ధర్మాలు, జపం తప్పనిసరిగా చేసుకోవాలి.

దానాలు : 1. అన్నదానం / బియ్యం/ పాలు/ పెరుగు/ తెలుపు వస్త్రాలు.

                                2. కందిపప్పు / దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు

జపం : క్రీం అచ్యుతానంత గోవింద, హరహర శంకర జయజయ శంకర ఈ జపాలు దానాలు వీరు నిరంతరం చేసుకుంటూ ఉండాలి. వీటివల్ల మాత్రమే వీరు అన్ని రకాల ఇబ్బందులనుంచి తప్పించుకోగలుగుతారు. జపం దానం మానివేస్తే వెంటనే వాటి ప్రభావం ఉంటుంది.

2. నాగభూషణం

ఉద్యోగంలో మార్పు ఉంటాయా? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో మార్పు 18 మే 2019 తర్వాత తప్పక ఉంటుంది. నిర్ణయాదుల్లో జీవితంలో తొందరపాటు ఉండడం వల్ల మరొకరికి తెలియజేసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మిగిలిన జాతకం అంతా బాగానే ఉంటుంది. 2020 ఏప్రియల్‌ నుంచి 1 సంవత్సరం పాటు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వీరు కందిపప్పు, నూనె నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

3. రామ తులసి

ఉద్యోగం మరియు వివాహం

2020 వరకు సమయం అస్సలు బాలేదు. ఉన్నదాంట్లోనే కొనసాగాలి. 2020 తర్వాత ఉద్యోగానికి వివాహానికి అనుకూల సమయం. వివాహస్థానంలోని కుజుడు అష్టమంలోని శుక్ర, రాహు దోష నివారణకోసం జపం, దానం తప్పనిసరి

వివాహం అనుకూలంగా జరగాలి తర్వాత వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం కోసం నిరంతరం జపం, దానం తప్పనిసరి.

దానాలు : 1. కందిపప్పు  2. పులిహోర/ స్త్రీలకు అలంకరణ వస్తువులు, 3. ఇడ్లీ, వడలు దానం తప్పనిసరి.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జపం తప్పనిసరిగా చేసుకోవాలి.

4.వెంకటేష్‌

ఆర్థిక నిల్వలకోసం ఏం చేయాలి?

నవంబర్‌ 7 2019 తర్వాత జీవితంలో అనుకూలమైన మార్పులు చాలా వస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కూడా మార్పులు అధికంగా ఉంటాయి. ఆర్థిక, సామాజిక ఎదుగుదల మంచి సిటిల్‌మెంట్ ఉంటాయి.

దానాలు : 1. గోధుమరవ్వ, చపాతి, 2. నూనె, వంటకు, దేవాలయాలలో దీపాలకు ఇవ్వాలి, పల్లీలు, 3. పులిహోర/ స్త్రీలకు అలంకరణ వస్తువులు, 4. కూరగాయలు దానం చేయాలి.

జపం : శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యతా   శ్రీమాత్రే నమః.

జపం నిరంతరం పారాయణ చేసుకోవాలి.

5. విజయ్‌

ఉద్యోగం ఎలా ఉంటుంది?

ప్రస్తుతం సమయం బాగానే ఉంది. మంచి ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు.  ఈ సం|రం రెండవ భాగం నుంచి 3 సం||ల పాటు సమయం బాగా లేకపోవటం వల్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఏదో ఒకదాంట్లో స్థిరపడాల్సిన అవసరం ఉంది.

అన్నదానం, పులిహోర, అలంకరణ వస్తువులు దానం చేసుకోవాలి.

జపం :  శ్రీ రాజమాతంగ్యై నమః;  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

6. పర్నిక

భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమైనా దోషాలు ఉన్నాయా?

బాలారిష్టదోషాల్లో శనిగ్రహం లగ్నంలో ఉండడం దోషంగా ఉంది. 20 ఫిబ్రవరి 2019 నుంచి ఉన్న దశ  సరియైనది కాకపోవటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య దోషాలకు అవకాశం ఉంటుంది. తగిన దానాలు జపాలు చేయించాలి.

శని గ్రహానికి జపం, రవి గ్రహానికి జపం చేయించుకోవాలి.

తల్లితండ్రులు శ్రీ మాత్రేనమః, క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవాలి.

దానాలు : 1. నూనె దీపాలకు, పేదవారికి ఆహారంలో వినియోగానికి, 2. గోధుమరవ్వ / గోధుమ రిట్టెలు, 3. ఇడ్లీ,  వడ, 4. కూరగాయలు, జీవితాంతం దానం చేయాలి.

7.వెంకట నాగ శ్రీహరి లు పూర్తి వివరాలు పంపలేదు. కాబట్టి వారి జాతక వివరాలు ఇక్కడ పొందుపరచలేదు. దయచేసి మీ జన్మనక్షత్రం, పుట్టిన స్థలం లాంటి వివరాలు తప్పక పంపగలరు. అదేవిధంగా  పూర్తి జాతకం రాయడానికి ఇది వేదిక కాదు కాబట్టి.. కేవలం మీ సమస్యలను మాత్రమే అడగగలరు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios