Asianet News TeluguAsianet News Telugu

దసరా నవరాత్రి.. బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు

బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు థలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది.అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం  ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా  చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన మొది ఆరాధన అవుతుంది.

navaratri celebration: goddess durga worshiped as bala tripura sundari devi
Author
Hyderabad, First Published Sep 29, 2019, 8:26 AM IST

మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ విశ్వశ్రీః విశ్వమంగళమ్‌

                                షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌

                                జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ లోకం సద్బుద్ధి సుందరమ్‌

                                పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనమ్‌

భంఢపుత్ర వదోద్యుక్త బాలా విక్రమ నందిత

అమ్మవారి రూపాల్లో మొదిరోజు బాలా త్రిపురసుందరి అలంకారం విశేషంగా చెప్పబడింది. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. అమ్మవారు మొదట మన ఇంో్ల చిన్నపిల్ల రూపంలో వస్తుంది. మన ఇంో్ల చిన్నపిల్లలు అమ్మవారి బాలాత్రిపురసుందరి ప్రతిరూపాలే. ఈ రోజున అమ్మను కొలిచి ఆమెను ధ్యానిస్తే మన సంతానం ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. నిర్మలమైన మనస్సుకు నిత్య సంతోషానికి గుర్తులు చిన్నపిల్లలు. బాల్యం దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాల రూపం తర్వాతనే వేరు వేరు థలు వేరు వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది.

అందరిలోను దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం  ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కన్పిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా  చిన్న శక్తినుంచి పెద్ద శక్తివరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి ఆరాధన మొది ఆరాధన అవుతుంది.

ఎవరైన ఏ మంత్రాన్నైనా ఉపాసించాలనుకునేవారికి మొదటగా ఇచ్చే మంత్రం బాలా మంత్రం. ఈ బాల మంత్రం తరువాతనే మిగతా మంత్రాలు ఉపాసనకు ఇస్తారు. ఇక్కడ పూజ చేసే చిన్న పిల్లలు అందరూ 2 సం||లు పై బడిన వారి నుంచి 10 సం||ల లోపు వారు మాత్రమే అయి ఉండాలి. సంవత్సరం లోపు పిల్లలు 10 సం||లు దాటిన పిల్లలు ఈ పూజలు అర్హులు కారు.

త్రిశక్తి  దేవాలయం యాదాద్రిజిల్లా వలిగొండలో ఈ రోజున  విశేషంగా  బాలలను ''బాలాత్రిపుర సుందరులు''గా భావించి ''బాలపూజ'' నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానంలో విశేషంగా నిర్వహించే కార్యక్రమం.

ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన తొందరగా తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఏ విధంగానైతే సంతోషం పొందుతారో, ఈ అమ్మవారు కూడా అలాగే సంతృప్తి చెందుతుంది. భండాసురుడు అనే రాక్షసురుడు తన 32 మంది సంతానమైన రాక్షసులను దండయాత్రకు పంపిస్తే అమ్మవారు తమ శక్తినంతా బాలా రూపంలో నింపి ఆ రాక్షసునిపైకి యుద్ధానికి పంపి విజయాన్ని సాధిస్తుంది.

ఈ రోజు అమ్మవారు గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడే పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం. అన్నం బలాన్నిస్తుంది. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్టిస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios