Asianet News TeluguAsianet News Telugu

కార్తీకమాసం.. భగినీ హస్త భోజనం

తాను చేసే పాప ప్రక్షాళన వలన అస్సలు తీరిక ఉండేది కాదు. కాని  ఒక్కగానొక్క చెల్లెలి కోరిక తీర్చలేకపోతున్నానే బాధ అన్నకు ఎప్పుడూ వెళుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు ఆ అన్నయకు తీరిక దొరికి చెల్లెలి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆరోజు కార్తీక శుద్ధ విదియ.

kartheeka masam special story
Author
Hyderabad, First Published Oct 29, 2019, 11:30 AM IST

కార్తీకమాసంలో వచ్చే వచ్చే శుద్ధ విదియ నాడు భగినీహస్తభోజనం పెడతారు. ఇది అన్న చెల్లెళ్ళకు సంబంధించిన పండుగ. రాఖీపౌర్ణమి ఒకి ఇది ఒకి రెండూ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకలు.

సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు. యమధర్మరాజు, అమ్మాయిపేరు యమున  చెల్లెలికి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. వివాహం అయిన తరువాత ఎన్నిసార్లు అన్నను భోజనానికి పిలిచినా వేరు వేరు పనుల ఒత్తిడి వల్ల వెళ్ళేవారు కాదు. తాను చేసే పాప ప్రక్షాళన వలన అస్సలు తీరిక ఉండేది కాదు. కాని  ఒక్కగానొక్క చెల్లెలి కోరిక తీర్చలేకపోతున్నానే బాధ అన్నకు ఎప్పుడూ వెళుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు ఆ అన్నయకు తీరిక దొరికి చెల్లెలి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆరోజు కార్తీక శుద్ధ విదియ.

రాక రాక వచ్చిన అన్నయను చూసి చెల్లెలు బాగా సంతోషపడింది. అన్నయ్యకు ఇష్టమైన పిండి పదార్థాలు అన్ని రకాల వంటకాలు చేసి అన్నయ్యకు కడుపునిండా భోజనం పెడుతుంది. యమ ధర్మరాజు చెల్లితో చెల్లీ ఈరోజు నాకు ఇష్టమైన పదార్థాలతో కడుపు నిండా భోజనం ప్టోవు. నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. అప్పుడు చెల్లెలి అన్నయ్యా లోకకళ్యాణం కోసం నాకు ఒక వరం ఇవ్వు.

ఈరోజున ఎవరైనా అక్క చెల్లెలు ఇంటికి ఏ అన్నయ్య కాని తమ్ముడు కాని వెళ్ళి భోజనం చేస్తారో నీవు వారి ఇంటికి  వాలి జోలికి వెళ్ళకూడదు అని వరం కోరుకుంటుంది. ఆ అన్నయ్య తథాస్తు అని దీవిస్తాడు. అనగా ఈరోజున ఏ అన్న కాని   తమ్ముడు కాని అక్క చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి అపమృత్యుదోషాలు ఉండవు అని దీని అర్థం.

కనుక ఈ రోజు అందరూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇంటికి వచ్చి భోజనం చేసినవారికి ఏ రకమైన దోషాలు అంటవు అని దీనిర్థం.

ఇది ఒక రకమైన సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం. ప్రస్తుత కాలంలో ఇలాటి పనులు చాలా అవసరం. అనుబంధాలు కరువవుతున్న ఈ తరుణంలో ఇలాటి పనులు చేయడం తప్పనిసరి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios