Asianet News TeluguAsianet News Telugu

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. శివుని ఆశీస్సులు మీ వెంటే

మద్యమాంసాదులు, మైధునాదులు నిషిద్దం. ఉసిరి కూడా పనికిరాదు. ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డ దానం చేయడంమంచిది. ఎర్రపూలు, ఎర్ర గాజులు దానం చేయాలి. శ్రీ దుర్గాదేవి ఆరాధన. ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమః మంత్రజపంమంచిది. దీనివలన శక్తి సామర్థ్యాలు, ధైర్యం కార్యవిజయం కలుగుతాయి.

kartheeka masam lord shiva special story
Author
Hyderabad, First Published Nov 8, 2019, 10:06 AM IST

పదహారవ రోజు : ఉల్లి, ఉసిరిక, చద్ది, ఎంగిలి, చల్ల మొదలైనవి పనికిరావు. నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం దానం చేయాలి. స్వాహా అగ్ని దేవతలను పూజించాలి. ఓం స్వాహాపతయే జాతవేదసే నమః మంత్ర జపం చేయాలి. దీని వలన ముఖవర్చస్సు, పెరుగుతుంది. తేజోవృద్ధి కలుగుతుంది. పవిత్రత లభిస్తుంది.

17వ రోజు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల, మరయు తరిగిన వస్తువులు పనికిరావు. ఔషధాలు, ధనం దానం చేయాలి. అశ్వినీ దేవతలను పూజించాలి. ఓం అశ్విన్యౌవైద్యౌతే నమః స్వాహా జపం చేయాలి సర్వవ్యాధినివారణ జరుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది.

18వ రోజు : ఉసిరి పనికిరాదు. పులిహోర, అట్లు, బెల్లం దానం చేయాలి. గౌరీదేవి ఆరాధన మంచిది. ఓం గగగగ గౌర్యై స్వాహా మంత్ర జపం మంచిది. దీని వలన అఖండసౌభాగ్యప్రాప్తి కలుగుతుంది.

19వ రోజు : నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి పనికిరావు. నువ్వులు, కుడుములు దానం చేయాలి. వినాయక ఆరాధన మంచిది. ఓం గం గణపతయే స్వాహా మంత్ర జపం, దీని వలన విజయం, సర్వవిఘ్న నాశనం కలుగుతుంది.

20వరోజు : పాలు పనికిరావు. గో, భూ, సువర్ణ దానాలు మంచిది. నాగేంద్రుడిని పూజించాలి. ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం అనే మంత్రజపాన్ని చేయడం మంచిది. దీనివలన గర్భదోష పరిహారం జరిగి సంతానవృద్ధి కలుగుతుంది.

21వ రోజు : ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం పనికిరావు. యథాశక్తి తోచినంత దానం చేయవచ్చు. కుమారస్వామి ఆరాధన మంచిది. ఓం సాం శరవణభవాయ కుమారాయ స్వాహా జపం మంచిది. దీని వలన సత్సంతానవృద్ధి కలుగుతుంది. జ్ఞానం, దిగ్విజయం కలుగుతాయి.

22వ రోజు : పింకి పనిచెప్పే పదార్థాలు ఏవీ పనికిరావు, బంగారం, గోధుమలు, పట్టుబట్టలు దానం చేయాలి. సూర్యారాధన మంచిది. ఓం సూం సౌరయే స్వాహా, ఓం భావం భాస్కరాయ స్వాహా జపం మంచిది. దీని వలన ఆయురారోగ్యాలు, తేజోవంతులు, బుద్ధిమంతులు వస్తారు.

23వ రోజు : ఉసిరిక, తులసి పనికిరావు. మంగళద్రవ్యాలు మంచిది. అష్టమాతృకల పూజ మంచిది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

24వరోజు : మద్యమాంసాదులు, మైధునాదులు నిషిద్దం. ఉసిరి కూడా పనికిరాదు. ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డ దానం చేయడంమంచిది. ఎర్రపూలు, ఎర్ర గాజులు దానం చేయాలి. శ్రీ దుర్గాదేవి ఆరాధన. ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమః మంత్రజపంమంచిది. దీనివలన శక్తి సామర్థ్యాలు, ధైర్యం కార్యవిజయం కలుగుతాయి.

25వ రోజు : పులుపు, చారు మొదలైనవి పనికిరావు. యథాశక్తి దానం చేయవచ్చు. దిక్పాలకుల పూజ మంచిది. ఓం ఈశాన్యాయస్వాహా జపం మంచిది. దీని వలన అఖండకీర్తి, పదవీప్రాప్తి లభిస్తాయి.

26వ రోజు : అన్ని పదార్థాలు వర్జించాలి. నిలువ ఉండే సరుకులు దానం చేయాలి. కుబేరుడిని పూజించాలి.  ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా జపం మంచిది. దీనివలన ధనలబ్ధి, లాటరీవిజయం, సిరి సంపదలకు కొదువ ఉండదు.

27. ఉల్లి, ఉసిరి, వంకాయ పనికిరావు. ఉసిరి, వెండి, బంగారం ధనం దానం చేయాలి. కార్తీక దామోదర పూజ, ఓం శ్రీ భూతులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహా జపం మంచిది. దీని వలన మహాయోగం, రాజభోగం, మోక్ష సిద్ధి కలుగుతాయి.

28వ రోజు : ఉల్లి, ఉసిరి, సొరకాయ గుమ్మడికాయ, వంకాయ పనికిరావు. నువ్వులు ఉసిరి దానం చేయాలి. ధర్మరాజు ఆరాధన. ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా జపం మంచిది. దీర్ఘకాల వ్యాధి నివారణ జరుగుతుంది.

29వ రోజు : పగి ఆహారం నిషిద్ధం. ఉసరికాయ కూడా నిషిద్ధం. శివలింగ ఆరాధన, విభూది పండు, దక్షణలు దానం చేయాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్తృత్యోర్ముక్షీయ మామృతాత్‌ జపం మంచిది. అకాల మృత్యుహరణలు, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.

30వ రోజు. పంగిపూజ ఆహారం నిషిద్ధము అని. నువ్వులు, తర్పణానికి సరిపడతాయి. సర్వదేవతలకు ఆరాధన మంచిది. ఓం అమృతాయస్వాహా అని జపించాలి. మమ సమస్త పితృదేవతాభ్యో నమః అని జపించాలి. దీనివలన ఆత్మ స్థైర్యం, కుటుంబక్షేమం కలుగుతాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios