Asianet News TeluguAsianet News Telugu

వృశ్చికరాశిపై గురుగ్రహ ప్రభావం

వృశ్చికరాశివారికి గురు అనుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. వీరికి అనుకున్న పనులు పూర్తి అవుతాయి. వీరు ఈ సంవత్సరం మొత్తం చాలా సంతోషంతో కాలం గడుపుతారు.

guru graha prabhavam on vruchika rashi
Author
Hyderabad, First Published Dec 8, 2018, 3:53 PM IST

వృశ్చికరాశివారికి గురు అనుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. వీరికి అనుకున్న పనులు పూర్తి అవుతాయి. వీరు ఈ సంవత్సరం మొత్తం చాలా సంతోషంతో కాలం గడుపుతారు. అంతా బావున్నది కదా అని అత్యాశకు పోరాదు. మితిమీరిన పనులు ఏవీ చేయకూడదు. తమను తాము కింద పడకుండా ఉన్న స్థాయిలోనే ఉండేటట్లుగా చూసుకోవడానికి జాగ్రత్త పడాలి. అలా ఉండడం వలన అన్ని పనులు అనుకూలంగా సమకూరుతాయి.

వీరు పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఏ కొంచెం శ్రమ పడినా వీరి పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఎదుివారు చూసి ఒక్కోసారి ఈర్షపడతారు. వీరు ఏమీ పని చేయకుండానే ఇంత ఉన్నత స్థితికి వచ్చారు అని. మేము ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని. అదే పూర్వపుణ్యాన్ని సంపాదించుకోవడం అంటారు. తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలు సాధించాలి.   పనుల్లో చాకచక్యం, తెలివితేటలు ఉంటాయి. పనులకు అనుగుణంగా అక్కడి ప్రణాళికలను మార్చుకుటాంరు. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.

వీరికి సంతానం వల్ల అనుకూలత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం లభిస్తాయి. మాట వింరు. వారి సంతానాన్ని చూసి వారే గర్వపడతారు. సృజనాత్మకత చాలా పెరుగుతుంది. పెద్దలతో సంప్రదింపులు చాలా అనుకూలిస్తాయి. పెద్దవారితో సహచర్యం వల్ల వీరికి చాలా విషయాలు తెలుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. ఒక పనిని ఆలోచించి మొదలు పెడతారు. మొదలు ప్టిెన పని పూర్తి అయ్యేవరకు వదిలిపెట్టరు. కొంత శ్రమ ఉన్నామంచిపేరు వస్తుంది.

సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. పరస్పర సహకారం లభిస్తుంది. పెద్దలు గురువులతో సంప్రదింపులు ఫలిస్తాయి.  సంఘంలో గౌరవం పెంచుకోవడానికి ఆలోచిస్తారు. తాము అనుకున్న పని తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. కళాకారులకు అనుకూల సమయం. సంఘంలో గౌరవం పెంచుకుటాంరు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వీరు ఇప్పుడు వ్యాపారాన్ని మొత్తం వ్యాపార ధోరణితో చూడకుండా కొంత దైవ చింతనతో చూసి ఎవక్కువగా మోసగించకుండా ఉంటారు. తాము మోసగించడానికి ఇష్టపడరు కావున, తాము మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వీరికి ఉన్నత విద్యలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. పరిశోధకులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన బాగా ఉంటుంది. కొద్ది శ్రమతోనే ఆ ఆలోచనను పూర్తి చేసుకుటాంరు. దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఏదైనా ఆధ్యాత్మిక చింతన ఉంటే మాత్రం చాలా తొందరగా వెళ్ళగలరు. లేనిచో దూర ప్రాంతాలకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుది. కష్టం ఉన్నా కూడా అనుకున్న పనిని సాధించి తీరుతారు.

వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు కనుక ఏ పనిని ప్రారంభించినా తొందరగా పూర్తి చేస్తారు. దానిని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. దీనినే పుణ్యబలం అంటారు. అనగా బ్యాంక్‌లో డబ్బులు ఉన్నట్లు. బాంక్‌లో డబ్బులు ఉంటే ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఎిఎం కార్డు ప్టిె డ్రా చేసుకున్నట్లుగానే ఇక్కడ కూడా అదే విధానం ఉంటుంది. బ్యాంకులో తమ ఖాతాలో డబ్బులు పూర్తి అయినట్లుగా ఇక్కడ కూడా మంచి పనులు చేయకపోతే పూర్వపుణ్యం ఖర్చై పోతాయి.

గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు చేసే జపం దానాలు గ్రహం అనుకూలతకోసం అలాగే ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నతస్థాయికి వెళ్లడానికి తోడ్పడుతుంది.  వీరు దక్షిణమూర్తి  ఆరాధన, సాయిబాబా పూజ, గురువారం ఉపాసం ఉండడం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios