Asianet News TeluguAsianet News Telugu

దసరా నవరాత్రి... లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు

ఈ అమ్మ నెలవంకయైన కిరీటం ధరించి మనకు కనబడుతుంది. లలితా అనగా లావణ్యం అని అర్థం. త్రిపుర సుందరీ అనగా ఆనందం కలిగించేది అని అర్థం. ఈ అమ్మవారు మనకు పై రెండు చేతులలో పాశం, అంకుశం, కింది చేతులలో చరకబిందు అలాగే ఐదు పూవుల బాణాలు ధరించి మనకు దర్శనమిస్తారు.

 

goddess durga devi worshiped as lalitha tripura sundari
Author
Hyderabad, First Published Oct 3, 2019, 10:52 AM IST

మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ విశ్వశ్రీః విశ్వమంగళమ్‌

                                షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌

                                జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ లోకం సద్బుద్ధి సుందరమ్‌

                                పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనమ్‌

''లకార రూపా లలితా, లక్ష్మీ వాణీ నిషేవితా''గా పిలువబడే అమ్మ నవరాత్రుల్లో ఐదవరోజు లలితా త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది.

ఈ అమ్మ నెలవంకయైన కిరీటం ధరించి మనకు కనబడుతుంది. లలితా అనగా లావణ్యం అని అర్థం. త్రిపుర సుందరీ అనగా ఆనందం కలిగించేది అని అర్థం. ఈ అమ్మవారు మనకు పై రెండు చేతులలో పాశం, అంకుశం, కింది చేతులలో చరకబిందు అలాగే ఐదు పూవుల బాణాలు ధరించి మనకు దర్శనమిస్తారు.

ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంచభౌతికశకే లలితా. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తస్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకి చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నిలోను ఉండే శక్తి మరొకి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది. ఇంకా విశేషంగా భూమిచుట్టూ ఉన్న ఓజోన్‌ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది.

ఈ అంశాన్ని శ్రీ సూక్తం (హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం) ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గతమని చెప్పడం జరిగింది. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్‌ పొర. ఈ ఓజోన్‌ పొర (హిరణ్య ప్రాకారం)కు బయట జ్వలంతిగా లోపలివైపు ఆర్ద్రగా కనిపిస్తుంది. భూమి శివలింగంగా భావనచేస్తే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ అమ్మవారిని లలితగా భావన చేస్తాం. అందుకే శివుని మీద కూర్చున్న లలిత విగ్రహాలుగా మనం చూస్తుటాం. ఈ అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.

కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింకి కూడా లలితాదేవి ఆలంబన. శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు సృష్టి సంబంధమైన వేరువేరు భాగాలలో వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది. దీనినే మేరువుగా కూడా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరు వేరు భాగాలలో ఉండే లలితాఅమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి మూడు పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ మూడు పురాలలో ఉండే రాక్షసత్వం (త్రిపురాసురులు) తొలగిస్తే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది.

ఈ పాంచభౌతికశక్తి సమాహారమైన అమ్మవారిని తత్త్వాన్ని ఉపాసిస్తే మన పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాలలోను అనంతమైన శక్తి చేకూరి మనని శాశ్వతులను చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆ తత్త్వాన్ని తెలుసుకుని ఈ నవరాత్రుల్లో ఉపాసిద్దాం.

అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి మన మనోకామనలను నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దద్ధ్యోదనం. దద్ధ్యోదనంలో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు ఉష్ణాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios