Asianet News TeluguAsianet News Telugu

వృశ్చికరాశిపై ఏలిననాటి శని ప్రభావం

వీరు మ్లాడే మాట స్పష్టంగా ఉండకపోవచ్చు. ఆ మాటలు అర్థం కాక ఎదుటివారు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. మాటల్లో ఒత్తిడి, ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత తక్కువౌతుంది. 

elina nati sani prabhavam on vruchika rashi
Author
Hyderabad, First Published Jan 9, 2019, 1:54 PM IST

వీరు మ్లాడే మాట స్పష్టంగా ఉండకపోవచ్చు. ఆ మాటలు అర్థం కాక ఎదుటివారు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. మాటల్లో ఒత్తిడి, ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత తక్కువౌతుంది.  ఎవరితో ఏం మ్లాడాలో తెలియకుండా ఉంటారు. కావున మాల్లో జాగ్రత్త వహించడం మంచిది. తాము దాచుకున్న డబ్బు దుర్వినియోగం అవుతుంది. కిం సంబంధ దోషాలు వచ్చే అవకాశం.

వీరికి మాట వల్ల అనవసర ఒత్తిడి ఉంటుంది అని తెలుసుకొని వీరు మౌనంగా ఉండడం మంచిది. తక్కువ మ్లాడుతూ ఎక్కువగా వింటూ ఉండాలి. ఎదుటివారికి మ్లాడే అవకాశాన్ని కల్పించాలి. అప్పుడు మాత్రమే వీరి మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. ఆర్థిక నిల్వలు తగ్గుతాయి కాబ్టి తమకు ఉన్నదానిలో ఎక్కువగా దానం చేయాలి. దానం చేయడం వల్ల కోల్పోయే అవకాశం ఉండదు. ముందుగానే దాన్ని ఇచ్చివేయడం వల్ల తాము కోల్పోయేది తక్కువగా ఉంటుంది.  మౌనంగా ఉంటూ ఏవో ఆలోచనలు ఆలోచించకుండా నిరంతరం జపం చేస్తూ మాత్రమే ఉండాలి. దానివల్ల దృష్టి సంబంధ లోపాలు కూడా తగ్గుతాయి.

ఆహార సంబంధ లోపాలు ఉంాయి. తీసుకునే ఆహారం విషయంలో సమయ పాలన పాటించాలి. అలాగే తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేవి ఉండాలి. అనారోగ్య సమస్యలు అవకాశం. పొట్టకు సంబంధించిన దోషాలు వచ్చే అవకాశం ఉంది. గ్టి పదార్థాలు తినడం తగ్గించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆచి, తూచి నడుస్తూ ఉండాలి. ప్రమాదాలకు అవకాశం ఉంది. ఇప్పుడు తగిలే చిన్న దెబ్బలు కూడా తొందరగా తగ్గవు. వాహనాలు కూడా తాము నడపకపోవడం మంచిది.

 ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. తొందరగా నోట్లో వేసుకుని మింగి వేయకూడదు.  తీసుకునే ఆహారం మంచినీటితో సహా తమకు శక్తిని ఇస్తుంది అనే భావనను మనసులో పెట్టుకుని మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. వీరు ప్రాణాయామాలు ఎక్కువగా చేయాలి. పొట్టను లోపలికి లాగే ప్రాణాయామాలు చేయాలి. లేకపోతే గ్యాస్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి. శ్వాసను ఊపిరి తిత్తుల నిండా గట్టిగా తీసుకొని వదలిపెట్టడం అలవాటు చేసుకోవాలి.

సామాజిక అనుబంధాలు కూడా కొద్దిగా తగ్గుతాయి. వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడుల జోలికి వెళ్ళకూడదు. వీలైతే పెట్టుబడులు ఆపడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పెట్టవలసి వస్తే తాము ప్టిెనంత ఎక్కువగా ఆశింపు ఉండకూడదు.  నూతన వ్యక్తులతో పరిచయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ తొందరగా నమ్మకూడదు.

పెట్టుబడులు అంత లాభాన్ని ఇవ్వవని తెలుసుకొని వీరు తాము పెట్టే పెడుబడులలో కొంత తగ్గించుకొని కొంత దానం చేయడానికి అధికంగా వెచ్చించాలి. అప్పుడు పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. సమాజంలో  గౌరవం కోసం ఎదురు చూడకూడదు. తామే ముందుగా వెళ్ళి ఎదుటివారిని పలకరించాలి. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూపులు మానుకోవాలి.

లాభాలు సద్వినియోగం తక్కువ. పెద్దల ఆశీస్సులకోసం ఎదురు చూస్తారు. అనుకున్నంత సంతృప్తి లభించదు. ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. ఆ వచ్చిన లాభాలు తమ సమాజంపై కుటుంబం పై ఆధారపడతాయి. సేవకులు చేసిన పనికి లాభాలు అనుకూలంగా వస్తాయి. వాటిని వీరు వినియోగించుకోకూడదు. వారికే అందివ్వాలి.

వీరు ఈ పనులు చేయడం వల్ల కర్మను అధిగమించినవారు అవుతారు. శని కర్మకు కారకుడు. కర్మను అధిగమించాలా? లేదా కర్మను అనుభవించాలా అనే విషయం ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అధిగమించాలనుకునే వారు తమను తాము  కోల్పోయి ఎదుటివారికి వారికి అవసరమైన పనుల్లో తమకు చేతనైన రీతిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే వారి దీవెనలు వీరి కర్మను అధిగమించడానికి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios