Asianet News TeluguAsianet News Telugu

మనం పాపాలు చేసామా..? పుణ్యాలు చేసామా..?

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా? లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా? అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు!

astrology... types of human body
Author
Hyderabad, First Published Oct 25, 2018, 3:57 PM IST

శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి.

1. స్థూల శరీరం (సాధారణ భౌతిక శరీరం)

2. సూక్ష్మ శరీరం (కేవలం మనస్సు, బుద్ధిలతో కూడినది)

3. కారణ శరీరం (పాప పుణ్యాల శేష ఫలితాలు బీజరూపకంగా ఉన్న శరీరం)

..ఇలా మనం చేసిన పాపం ఈ మూడు శరీరాల్లో నిలువ ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా? లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా? అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు!

దుర్గంధాన్ని బట్టి చెడువస్తువులనూ, సుగంధాన్ని బట్టి మంచి వస్తువులను అంచనా వేసినట్లు ఈ మూడు శరీర లక్షణాలను బట్టి మనలో నిలువ ఉన్న పాప పుణ్యాలను కూడా అంచనా వేయవచ్చు !

1. స్థూల శరీర లక్షణాలు : సాధారణంగా స్థూల శరీరలక్షణాలు ఎక్కువగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలమీద ఆధారపడి ఉంటాయి.

ఎ. స్థూల శరీరం పాపరహితంగా పవిత్రంగా ఉంటే తెల్లవారు జామునే మేల్కొంటుంది. (లేదా తెల్లవారు జామున మేలొన్నా పవిత్రమౌతుంది)

పాపం పెరిగిన కొద్దీ సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర పట్టడం, ఆలస్యంగా నిద్రలేవడం ఎక్కువౌతుంది.

ఉదా : ఈ ప్రపంచంలో పాపం అంటే తెలియని స్థితిలో ఉన్న శిశువులు కానీ, పాప రహితులైన మహాత్ములుగాని తెల్లవారు జామునే మేల్కొటాంరు. గమనించండీ!

బి. స్థూల శరీరం పాప రహితంగా పవిత్రంగా ఉంటే ఏ మాత్రం బద్ధకం, సోమరితనం లేకుండా ఉపయుక్తమైన ఏ పని చేయడానికైనా సన్నద్ధంగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఒకవేళ పాపం పెరుగుతూ ఉంటే సోమరితనం, బద్ధకం కూడా పెరుగుతాయి. ఉపయుక్తమైన పనులు చేసే విషయంలో శరీరం ఏ మాత్రం సన్నద్ధంగా ఉత్సాహంగా ఉండదు. నిరుపయోగకరమైన మరియు కాలాన్ని వ్యర్థం చేసే విషయాల్లో ఉత్సాహం, సన్నద్ధత పెరుగుతాయి.

ఈ విషయంలో కూడా పాపం అంటే తెలియని శిశువులనూ, పాపరహితులైన మహాత్ములను గమనించండీ? వారు బద్ధకంగా వ్యవహరించింది ఎప్పుడూ కనిపించదు.

సి. స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నియతిబద్ధంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం జరుగుతోంది. పాపంతో అపవిత్రమైనకొద్దీ క్రమశిక్షణ లోపిస్తుంది.

డి. స్థూల శరీరంలో పాపం పెరిగి అపవిత్రమైనకొద్దీ అనవసర ఆహారం, దోష భూయిష్టమైన ఆహారమే తీసుకోవాలనిపిస్తుంది. లేదా అలా తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. పవిత్రత పెరిగిన కొద్దీ మితాహారం, ఆరోగ్యాన్ని పవిత్రతను ఇచ్చే ఆహారం తీసుకోవడం జరుగుతుంది.

ఇ. స్థూలశరీరం అపవిత్రమైనకొద్దీ అవసరానికి మించి నిద్రించడం జరుగుతుంది. పవిత్రమైనకొద్దీ ఎంత అవసరమో అంతే నిద్రించడం ఉంటుంది.

ఎఫ్‌. స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నిద్ర లేచిన క్షణంలో వెంటనే (కాన్సియస్‌) స్పృహలోకి వచ్చి ఉత్సాహంగా ఉంటారు. లేదా ఉత్సాహంగా నిద్రలేస్తారు. నిద్ర లేచిన తర్వాత వారి ముఖం మబ్బు లేకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

పాపంతో అపవిత్రమౌతున్న కొద్దీ నిద్ర లేచిన 10, 15 నిమిషాల వరకు (కాన్సియస్‌) స్పృహలోకి రాలేకపోతారు. కారణమేమిటంటే ఆత్మతో శరీరానికి బంధం ఎక్కువౌతుంది.

ఇలా స్థూల శరీర లక్షణాలను బట్టి పాప పుణ్యాల నిలువను గుర్తించవచ్చు.

దుర్గంథాన్ని బట్టివాతావరణంలో అపవిత్రతను కలుగజేస్తున్న చచ్చిన ఎలుకను గుర్తించినట్లు స్థూల శరీర లక్షణాలను బట్టి జీవితంలో వ్యాపించిన అపవిత్రతనూ, పాపాన్ని గుర్తించాలి. దీని వల్లనే శుభాలు వాయిదా పడుతున్నాయని, భవిష్యత్తులో కష్టాలు రావడం వల్ల పాపం ప్రక్షాళన కావలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే జాగ్రత్తపడి కఠినమైన సాధన వల్ల స్థూల శరీరాన్ని సరియైన విధంగా ఉంచుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios