Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి: కండువాకప్పిన వైఎస్ జగన్


గురువారం మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. అయితే శనివారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీలో చేరారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారని సమాచారం

magunta srinivasula reddy joins ysrcongress party
Author
Hyderabad, First Published Mar 16, 2019, 7:09 PM IST

హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

గురువారం మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. అయితే శనివారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీలో చేరారు. 

మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నారని సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడమే తన లక్ష్యమన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.  

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్పష్టంచేశారు. తన తండ్రి నుంచి వైఎస్ కుటుంబంతో తమకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడమే తన లక్ష్యమన్నారు. 

మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయన వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలో చేరి తప్పు చేశా, శిక్ష అనుభవించి పుట్టింటికి వచ్చా: వైసీపీలోకి ఎంపీ బుట్టా రేణుక

జగన్ సిఎం కావడం ఖాయం: వైసిపిలో చేరిన వంగా గీత

చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్

వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగాగీత: కండువాకప్పిన వైఎస్ జగన్

 

Follow Us:
Download App:
  • android
  • ios