Asianet News TeluguAsianet News Telugu

అనంత టీడీపీ ఎంపీ అభ్యర్థి: ఆదాయంలో జేసీ పవన్ కన్నా భార్యదే పై చేయి

అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జేసీ పవన్ కుమార్ రెడ్డి  ప్రతి ఏటా రూ. 24 లక్షలను ఆదాయపు పన్ను కింద చెల్లిస్తున్నాడు. 

here is tdp anantapuram mp candidate jc pawan kumar reddy assets
Author
Anantapur, First Published Mar 21, 2019, 11:00 AM IST

అనంతపురం:  అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జేసీ పవన్ కుమార్ రెడ్డి  ప్రతి ఏటా రూ. 24 లక్షలను ఆదాయపు పన్ను కింద చెల్లిస్తున్నాడు. పవన్ కుమార్ రెడ్డి కంటే ఆయన భార్య సంయుక్తే ఆయన కంటే ఎక్కువగా ఆదాయపు పన్ను కడుతోంది. ప్రతి ఏటా సంయుక్త రూ. 35 లక్షల ఆదాయపు పన్ను కడుతోంది.

జేసీ పవన్ కుమార్ రెడ్డి తొలిసారిగా అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నాడు.  అనంతపురం ఎంపీ స్థానం నుండి  జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. 

గత ఎన్నికల సమయంలో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు టీడీపీలో చేరారు.  అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డిలు టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా అనంతపురం ఎంపీ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి నుండి జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

అనంతపురం ఎంపీ స్థానానికి నామినేషన్  సమర్పించిన సందర్భంగా అఫిడవిట్‌ను జేసీ పవన్ కుమార్ రెడ్డి సమర్పించారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారంగా  జేసీ పవన్ కుమార్ రెడ్డి  ఆస్తులు, అప్పులిలా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం జూటూరులో 130.87 ఎకరాలు మెట్టభూమి పవన్ కుమార్ రెడ్డి పేరున ఉంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని తొండపల్లి గ్రామంలో సర్వే నెంబర్‌-170లో 2,17,800 చదరపు అడుగుల స్థలం ఉంది. పుట్లూరు మండలం కుమ్మనమలలో 16.58 ఎకరాలు భూమి ఉంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం-10లో ఫ్లాట్‌ నెం-138ఏలో 22,833 చదరపు అడుగుల స్థలం ఉందని అఫిడవిట్‌లో జేసీ పవన్ కుమార్ రెడ్డి  ప్రకటించారు.

2011లో ఈ భూమిని రూ.10.90 కోట్లకు కొనుగోలు చేసి రూ. 3.90 కోట్లతో ఇల్లును నిర్మించినట్టుగా ఆయన  అఫిడవిట్‌లో ప్రకటించారు. ప్రస్తుతం దీని విలువ సుమారు. రూ. 16.95 కోట్లు ఉంటుందని అంచనా.మరో వైపు 1113.61 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, 498.91 గ్రాముల వజ్రాభరణాలు ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్‌లో వివరించారు.

ఆంధ్రా బ్యాంకు హైదరాబాదు జూబ్లీహిల్స్‌ బ్రాంచులో రూ. 9,45,722లు, యాక్సిస్‌ బ్యాంకులో రూ. 60,274, కొటక్‌ మహీంద్రా బ్యాంకులో రూ. 16,327, అనంతపురం, హైదరాబాదు కెనరా బ్యాంకుల్లో రూ. 2,95,046లు, హెచ్‌డీఎఫ్‌సీ జూబ్లీహిల్స్‌ బ్రాంచులో రూ. 1,03,290లు డిపాజిట్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 14,20,639లు డిపాజిట్లు ఉన్నట్టుగా అఫిడవిట్‌లో పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఇక జేసీ పవన్ కుమార్ రెడ్డి సతీమణి సంయుక్త పేరున  కూడ పలు ఆస్తులున్నాయి.  పెద్ద పప్పూరు మండలం జూటూరులో 6.27 ఎకరాలు మెట్టభూమి ఉంది. 
యాడికి మండలం గుడిపాడులో 28,314 చదరపు అడుగుల స్థలం ఉంది.  దీన్ని 2011లో రూ. 21,710లకు కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 87 వేలుగా ఉన్నట్టు అఫిడవిట్‌లో పొందుపర్చారు.

యాడికి మండలం గుడిపాడులో 79,279 చదరపు అడుగుల స్థలం ఉంది. 2002లో రూ. 5,22,550లకు కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 24.75 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు.తాడిపత్రి పట్టణ సమీపంలోని హుసేనాపురంలో 12963 చదరపు అడుగుల స్థలం ఉంది. 2016లో ఈ స్థలాన్ని రూ. 11,34,775లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ. 13.61 లక్షలుగా ఉంటుందని వివరించారు.

 తెలంగాణలోని  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ గ్రామంలో 21,780 చదరపు అడుగుల స్థలం ఉంది. 2018లో రూ. 84.80 లక్షలకు మరొకరితో కలిసి ఈ భూమిని కొనుగోలు చేశారు.  వీరి వాటాగా రూ. 42.41 లక్షలు ఉంది. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ. 43.50 లక్షలుగా ఉందని  అఫిడవిట్‌లో పొందుపర్చారు.

కర్ణాటక బ్యాంకు బంజారాహిల్స్‌ బ్రాంచులో రూ. 5,14,140లు, యాక్సిస్‌ బ్యాంకులో రూ. 43,919లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 40,93,361, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాడిపత్రి బ్రాంచులో రూ. 90,582లు, కెనరా బ్యాంకు అనంత పురం బ్రాంచులో 2,947లు, యూకో బ్యాంకు బంజారాహిల్స్‌లో రూ. 20,816లు డిపాజిట్లు ఉన్నాయి. మొత్తంగా ఆమె పేరిట రూ. 48,65,765లు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని  ఆ అఫిడవిట్‌లో తెలిపారు.
 
ఇక జేసీ పవన్ కుమార్ రెడ్డి అప్పులను కూడ అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ట్రీ డెన్ట్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు సంబంధించి రూ. 29.98 లక్షలు రుణం తీసుకున్నారని వివరించారు. పవన్ కుమార్ రెడ్డి కంటే ఆయన భార్య సంయుక్త పేరునే అప్పులు  ఎక్కువగా ఉన్నట్టుగా అఫిడవిట్‌లో వివరించారు.

భ్రమరాంబ మినరల్‌ కంపెనీ పేరున రూ. 1,43,456లు, ట్రీ టెన్డ్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ పేరున రూ. 15,00500 రుణం తీసుకున్నారు.ఎల్‌ఐసీలో రూ. 20 లక్షలకు పాలసీలు చేశారు. ఏడాదికి రూ. 1.05 లక్షలు చెల్లిస్తున్నారు. అదే సంస్థలో మరో రూ. 12 లక్షలు పాలసీ చేశారు. ఏడాదికి ఆ పాలసీకి రూ. 58,849లు చెల్లిస్తున్నట్టుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మరో వైపు జేసీ పవన్ కుమార్ రెడ్డి, ఆయన  సతీమణి సంయుక్త పేరుతో పలు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్టుగా ఆయన వివరించారు.ట్రీ డెన్డ్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌లో రూ. 1.30 కోట్లు, ల్యాటిట్యూ ఓవర్‌సిస్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ. 70 వేలు, త్రిసూల్‌ సిమెంట్‌ ఇండస్ట్రీస్‌లో రూ. 18.67 లక్షలు, వరమ్‌ రీసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ. 50 లక్షల పెట్టుబడులు పెట్టారు. 

పవన్ కుమార్ రెడ్డి సతీమణి సంయుక్త పేరున ట్రీ టెన్డ్‌ పవర్‌ సిస్టమ్‌ లిమి టెడ్‌లో రూ. 97,01,000లు, లెటిట్యూ ఓవర్‌సిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ. 30 వేలు, త్రిసూల్‌ సిమెంట్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌లో రూ. 7.95 లక్షలు, పెన్నా సి మెంట్‌ ఇండస్ట్రీస్‌లో రూ. 4 లక్షలు పెట్టుబడులు పెట్టారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కింద ఆయన సతీమణి పేరున రూ. 1.26 కోట్లు ఉన్నాయని ఆయన ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios