Asianet News TeluguAsianet News Telugu

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

ఈ నెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తోందని రూరల్ మీడియా ఆనే సంస్థ ప్రకటించింది. రెండు మాసాల పాటు ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించారు. ఆ సంస్థ అంచనా ప్రకారంగా వైసీపీకి  అత్యధికంగా వస్తాయని ప్రకటించారు.  ఆ సర్వే ఫలితాలను యధాతథంగా  ఇస్తున్నాం.

ysrcp will get 102 assembly seats in up coming elections in andhra pradesh state
Author
Amaravathi, First Published Apr 5, 2019, 3:22 PM IST


అమరావతి:ఈ నెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తోందని రూరల్ మీడియా ఆనే సంస్థ ప్రకటించింది. రెండు మాసాల పాటు ఏపీ వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించారు. ఆ సంస్థ అంచనా ప్రకారంగా వైసీపీకి  అత్యధికంగా వస్తాయని ప్రకటించారు.  ఆ సర్వే ఫలితాలను యధాతథంగా  ఇస్తున్నాం.

సర్వేలో 175 అపెంబ్లీ సీట్ల అంచనా ఫలితాలు 

వైఎస్సార్‌ సిపి - 102 
తెలుగుదేశం పార్టీ -72 
జనసేన - 01 , కాంగ్రెస్‌-00 , బీజేపీ-00 

జిల్లాల వారీగా సర్వే ఫలితాలు

శ్రీకాకుళం(10) -టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ - 06 
విజయనగరం(09) -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 06 
విశాఖపట్టణం(15) - టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08, జనసేన-01 
ఈస్ట్‌ గోదావరి(19) టీడీపీ-12, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
వెస్ట్‌ గోదావరి(15) -టీడీపీ-07, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08 
కృ ష్ణా(16) - టీడీపీ-11, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 05 
గుంటూరు(17) -టీడీపీ-10, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
నెల్లూరు(10) -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
ప్రకాశం(12) - టీడీపీ- 04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08 
కర్నూలు(14) -టీడీపీ -01 , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-13 
వైఎస్సార్‌ కడప(10) -టీడీపీ -01, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-09 
అనంతపురం(14) - టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-10 
చిత్తూరు(14) -టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08 

ఈ ఫలితాలపై రూరల్ మీడియా ఓ నోట్‌ జత చేసింది. ఈ అంచనాలన్నీసమగ్రమూ, సంపూర్ణం అని  తాము  చెప్పబోవడం లేదని ఆ నోట్‌లో స్పష్టం చేసింది. తాము స్వయంగా కలిసిన గ్రామీణులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్ధలు ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన సర్వేగా దాన్ని పేర్కొంది. అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారో అదే జరుగుతుందని, పోలింగ్‌ ముందు జరిగే ప్రలోభాలు, బ్యాంకుల్లో జమ అయ్యే పసుపుకుంకుమ,అన్నదాత సుఖీభవ డబ్బుల ప్రభావం కూడా ఈ ఫలితాల మీద ఉండే అవకాశం ఉందని తెలిపింది.

తమ సర్వేలో వెల్లడైన సారాంశాన్ని ఈ కింది విధంగా వివరించింది.

.ఫిబ్రవరి 3 నుండి మార్చి నెలాఖరు వరకు, 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. 
ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారు? అని ప్రజల ప్రైవసీలోకి వెళ్లకుండా, ప్రభుత్వ పనితీరు పై మాత్రమే అభిప్రాయాలు తెలుసుకొని, వారు ఏ పార్టీ వైపు ఉన్నారనేది అంచనా వేశాం. కొందరైతే డైరెక్టుగా తమ మద్దతు ఏ పార్టీకో తేల్చి చెప్పారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం కొంత ఉన్నప్పటికీ, మిగతా అన్ని ప్రాంతాల్లో టీడీపీ,వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే స్రధాన పోటీ ఉంది. 

తాము నిర్వహించిన సర్వే ఎలా సాగిందనే విషయాన్ని రూరల్ మీడియా సంస్థ ఈ కింది విధంగా వివరించింది.

మీ నియోజక వర్గంలో అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఓటర్లు స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థి గతంలో ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? లేదా అని చూస్తామన్నారు. రాయల సీమ ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమని చెప్పారు . కోస్తాంధ్ర ప్రజలు అభ్యర్థుల పార్టీ గత చరిత్రచూస్తామన్నారు. ఈ కారణాలు ఇలా ఉంటే, పోలింగ్‌కి ముందు రోజు అభ్యర్థి పంచే డబ్బు,లిక్కర్‌, బహుమతులు కూడా ఓటర్ల పై ప్రభావం చూపుతాయని అధిక శాతం ప్రజలు ఒప్పుకున్నారు. 

ఎన్నికల ప్రచారంలో రెండు ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఈ సర్వేలో స్పష్టమైంది. 
ఆంధ్రవాళ్లను హైదరాబాద్‌లో కొడుతున్నారని జనసేన పదేపదే చేసిన ప్రచారానికి కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. '' ఒక్క ఆంధ్ర పౌరుడన్నా ప్రాంతీయ వివక్షతో తమను కొట్టారని ఫిర్యాదు చేశారా? హైదరాబాద్‌లో దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలతో పాటు, ఆంధ్రాలోని ప్రతీ జిల్లా నుండి కొందరు వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషం రెచ్చకొడుతున్నారు..'' అని అనకాపల్లికి చెందిన రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ప్రతినిధి బాలుగది అన్నారు. 

కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూనే, అమలు కాని వాగ్దానాలను, తీవ్రంగా పెరిగిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు తెచ్చిన చంద్రన్న బీమా, పంటకుంటల నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక పథకాలకు విశేష స్సందన వచ్చింది. రాయల సీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గుంటూరు,కృష్ణా జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ సథకాల పట్ల కొంత సానుకూలత ఉంది. 
పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ వర్గాల అభిప్రాయాల ఆధారంగా, ఈ అధ్యయనం జరిగింది. నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, రైతులు, గిరిజనులు స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు గ్రామీణ పాత్రికేయుల అభిప్రాయాలతో, ఈ సర్వే రూపొందించాం. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలోని 5 నుంచి 8 గ్రామాల్లో ఈ అభిప్రాయ సేకరణ నిర్వహించాం. ఆదివాసీ కొండ ప్రాంతాల్లో విద్య,వైద్యం,విద్యుత్‌ అందక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సర్వేలో రూరల్‌మీడియా టీం గుర్తించింది. 


నోట్: ఈ సర్వేతో మా సంస్థకు ఏ విధమైన సంబంధం లేదని పాఠకులు గమనించ మనవి. రూరల్ మీడియా విడుదల చేసిన సర్వేను యధాతథంగా అందించాం.

 

సంబంధిత వార్తలు

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

 


 

Follow Us:
Download App:
  • android
  • ios