Asianet News TeluguAsianet News Telugu

జగన్ లో మార్పులేదు, చంద్రబాబు మళ్లీ సీఎం.. ఉండవల్లి

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఇప్పటికే పోలింగ్ ముగిసినా.. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఎవరికివారు సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు. 

undavalli arun kumar shocking comments on election results
Author
Hyderabad, First Published Apr 22, 2019, 4:49 PM IST

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఇప్పటికే పోలింగ్ ముగిసినా.. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఎవరికివారు సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయుకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ‘‘‘‘2014లో జగన్‌కు ఇప్పటి జగన్‌కు తేడా ఏం లేదు. అయితే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. రాష్ట్రంలో యువత ఎక్కువగా జగన్‌ వైపే ఉన్నారు. వీటన్నింటికీ మించి.. ఈ సారి జరిగిన ఎన్నికలను ఎక్కడా చూడలేదు.’’ అని ఆయన అన్నారు.

‘‘ దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలు ఒక్కొక్కరికీ అకౌంట్లో పదివేలు రూపాయలు వేయడం.. అంతేగాక ఏటా వేస్తానని బాబు చెప్పడం.. టీడీపీకి కలిసి వస్తుంది. ఇది కేవలం పసుపు కుంకుమ మాత్రమేనని.. మిగిలిన వాటితో సంబంధం లేదని బాబు చెప్పడం గమనర్హం. డెఫినెట్‌గా పదివేలు పని చేయాలనే నేను అనుకుంటున్నాను. పని చేసి ఉంటుందనే భావిస్తున్నా. తమకు ఉదారంగా ఇచ్చాడు.. సహాయం చేశాడు అనుకుంటే.. చంద్రబాబుకే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఓటేస్తారు అదే జరిగితే మళ్లీ చంద్రబాబే సీఎం’’ అని చెప్పుకొచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios