Asianet News TeluguAsianet News Telugu

టీడీపి అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా ఇదే: టీజీ వెంకటేష్ తనయుడికి టికెట్

విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లుట నిరాకరించారు. ఎస్వీ మోహన్ రెడ్డి స్థానంలో పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కు టికెట్ ఇచ్చారు.

TG Bharath gets ticket: TDP last list
Author
Amaravathi, First Published Mar 19, 2019, 7:30 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపే పార్టీ అభ్యర్థుల తుది జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. మిగిలిన 36 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి విడుదల చేసింది.తొలి జాబితాలో కొన్ని మార్పుచేర్పులు చేసింది. 

విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లుట నిరాకరించారు. ఎస్వీ మోహన్ రెడ్డి స్థానంలో పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కు టికెట్ ఇచ్చారు. 

ఉండి నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపుతున్నారు.  సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికే నంద్యాల స్థానం దక్కింది. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు.  విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అశోకగజపతిరాజు కూతురు అదితి పోటీ చేయనున్నారు.

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు
2. విజయనగరం- అదితి గజపతిరాజు
3. భీమిలి- సబ్బం హరి
4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
5. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు
6. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు
7. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
9. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
10. నర్సాపురం- బండారు మాధవనాయుడు
11. పోలవరం- బొరగం శ్రీనివాసరావు
12. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్‌
13. బాపట్ల- అన్నం సతీష్‌ ప్రభాకర్‌
14. నరసరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు
15. మాచర్ల- అంజిరెడ్డి
16. దర్శి- కదిరి బాబురావు
17. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
18. కావలి- విష్ణువర్ధన్‌రెడ్డి
19. నెల్లూరు- రూరల్‌ అబ్దుల్‌ అజీజ్‌
20. వెంకటగిరి- కె.రామకృష్ణ
21. ఉదయగిరి- బొల్లినేని రామారావు
22. కడప- అమీర్‌బాబు
23. రైల్వేకోడూరు- నర్సింహ ప్రసాద్‌
24. ప్రొద్దుటూరు- లింగారెడ్డి
25. కర్నూలు- టీజీ భరత్‌
26. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి
27. కోడుమూరు- బి.రామాంజనేయులు
28. గుంతకల్లు- ఆర్‌.జితేంద్రగౌడ్‌
29. శింగనమల- బండారు శ్రావణి
30. అనంతపురం అర్బన్‌- ప్రభాకర్‌ చౌదరి
31. కల్యాణదుర్గం- ఉమామహేశ్వరనాయుడు
32. కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌
33. తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌
34. సత్యవేడు- జేడీ రాజశేఖర్‌
35. గంగాధరనెల్లూరు- హరికృష్ణ
36. పూతలపట్టు- తెర్లాం పూర్ణం 

Follow Us:
Download App:
  • android
  • ios