Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ సర్వే: కోటేశ్వరరావు కోసం ఏపీలో తెలంగాణ పోలీసుల జల్లెడ

ఎన్నికల సమయం కావడంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనే అనేక సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎవీ అసలువో..? ఏవీ నకిలీవో కూడా కనిపెట్టడం కష్టం.

telangana police searching koteswararao for fake survey on ap assembly elections
Author
Hyderabad, First Published Apr 9, 2019, 12:37 PM IST

ఎన్నికల సమయం కావడంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనే అనేక సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎవీ అసలువో..? ఏవీ నకిలీవో కూడా కనిపెట్టడం కష్టం. వీటిలో కొన్ని ఓటర్లను తప్పు దారి పట్టిస్తుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది.

తాజాగా కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తోందంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ సర్వే యూట్యూబ్‌లో హల్ చల్ చేసింది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

ఈ కేసులో భాగంగా ఈ వార్తను రూపొందించిన టీఎఫ్ఎసీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విచారణలో ఇతనికి సర్వే విషయాన్ని వాట్సాప్ ద్వారా కోటేశ్వరరావు అనే వ్యక్తి పంపినట్లుగా తెలుస్తోంది.

గుంటూరుకు చెందిన ఇతను టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితుడుగా పోలీసులు భావిస్తున్నారు. కోటేశ్వరరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ఉన్న భవనం కేంద్రంగా పని చేసిన టీఎఫ్ఎసీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఈ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు టీఎఫ్‌సీ డైరెక్టర్ శాఖమూరి తేజోభాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే జగన్ సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుకా టీఎఫ్‌సీ సంస్థ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios