Asianet News TeluguAsianet News Telugu

మీ ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పండి: చంద్రబాబుకు పవన్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీ చేసిన దోపిడీలు మీడియాను అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు మరచిపోలేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ మనతో లేడు అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలని పవన్ హెచ్చరించారు. 

pawan kalyan warns to ap cm chandrababu naidu
Author
Amaravathi, First Published Mar 29, 2019, 8:32 PM IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. జీవితంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చెయ్యడం చేతకాని వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

జనసేన పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉందనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ చేసిన దోపిడీలు మీడియాను అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు మరచిపోలేదన్నారు. 

తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ మనతో లేడు అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలని పవన్ హెచ్చరించారు. 

ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ మన స్నేహితుడే.. అంతా కలిసే పనిచేద్దాం అంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు విశాఖజిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, మాజీమంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు సైతం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. 

అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మద్దతు కోసం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌, చంద్రబాబు కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా ఏమీ లేరన్నారు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయిందన్న రమణబాబు ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. 

జనసేన, టీడీపీ రెండూ కలిసే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పదే పదే చెప్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం రెండు ఒక్కటేనని ప్రచారం చేస్తుండటం జనసేన తీవ్రంగా పరిగణిస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios