Asianet News TeluguAsianet News Telugu

ఒకే దెబ్బతో కేసీఆర్, జగన్, మోదీలను ఫినిష్ చేస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఒకే దెబ్బతో ముగ్గుర్నీ ఫినిష్ చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీది, బీజేపీది విడదీయరాని భార్యాభర్తల సంబంధం అంటూ వ్యాఖ్యానించారు. ఇంట్లో కాపురం చేస్తూ బయట నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ధైర్యం ఉంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి రావాలని డిమాండ్ చేశారు. 

KCR, Jagan , Modi finish with a single blow
Author
Nandyal, First Published Mar 26, 2019, 9:02 PM IST

నంద్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే దెబ్బతో ముగ్గుర్నీ ఫినిష్ చేస్తానని స్పష్టం చేశారు. 

వైసీపీది, బీజేపీది విడదీయరాని భార్యాభర్తల సంబంధం అంటూ వ్యాఖ్యానించారు. ఇంట్లో కాపురం చేస్తూ బయట నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ధైర్యం ఉంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి రావాలని డిమాండ్ చేశారు. 

రండి మా తడాఖా ఏంటో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ముసుగులో గుద్దులాట వద్దని ధైర్యం ఉంటే రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల యుద్ధంలో ఇంటికో సైనికుడు రావాలని ఆయన పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

కేసీఆర్‌ ఢీ అంటే ఢీ అంటామంటూ సవాల్ విసిరారు. తెలంగాణ కంటే మిన్నగా ఏపీని తయారు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల కోసం వీరసైనికుడిగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తాను ముగ్గురు దుర్మార్గులతో పోరాడుతున్నానని తెలిపారు. 

ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు త్వరలోనే మహిళందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందజేస్తానని ప్రకటించారు. 

పింఛన్లు పదిరెట్లు పెంచి రూ.2వేలు చేశామని స్పష్టం చేశారు. దాన్ని రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదేనని ప్రకటించారు. చంద్రన్న పెళ్లి కానుక, దుల్హన్‌ పథకాల కింద ఇచ్చే సాయాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios