Asianet News TeluguAsianet News Telugu

బిఎస్పీ, లెఫ్ట్, జనసేనల పొత్తు: మాయావతి పార్టీకి 3 ఎంపీ, 21 అసెంబ్లీలు

ఏపీ రాష్ట్రంలో జనసేన, లెఫ్ట్, బిఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో బిఎస్సీకి మూడు ఎంపీ స్థానాలను జనసేన కేటాయించింది. మిగిలిన స్థానాల్లోలెఫ్ట్, జనసేన లు పోటీ చేయనున్నాయి.
 

janasena allots 3 mp, 21 assembly seats for bsp in upcoming elections
Author
Amravati, First Published Mar 17, 2019, 3:57 PM IST


అమరావతి: ఏపీ రాష్ట్రంలో జనసేన, లెఫ్ట్, బిఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో బిఎస్సీకి మూడు ఎంపీ స్థానాలను జనసేన కేటాయించింది. మిగిలిన స్థానాల్లోలెఫ్ట్, జనసేన లు పోటీ చేయనున్నాయి.

ఆదివారం నాడు బిఎస్పీ జాతీయ నేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల విషయమై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. బిఎస్పీకి మూడు ఎంపీ, 21  అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

తిరుపతి, చిత్తూరు, బాపట్ల ఎంపీ స్థానాలను బిఎస్పీకి కేటాయించారు. మిగిలిన 22 ఎంపీ స్థానాల్లో జనసేన, లెఫ్ట్ పార్టీలు పోటీ చేయనున్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలకు ఏఏ అసెంబ్లీ, ఏ పార్లమెంట్ స్థానాలు కేటాయించాలనే విషయమై కూటమిలోని పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి.

లెఫ్ట్‌ పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయమై కూడ రెండు రోజుల్లో ఫైనల్ చేసే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios