Asianet News TeluguAsianet News Telugu

రూరల్ మీడియా సర్వే: చంద్రబాబు వర్సెస్ జగన్, ప్లస్ లూ, మైనస్‌లూ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై రూరల్ మీడియా అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. తాము ఈ సర్వేను ఏ విధంగా చేశామనే విషయాన్ని కూడా వివరించింది. 

how to rural media conducted this survey
Author
Amaravathi, First Published Apr 5, 2019, 3:49 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై రూరల్ మీడియా అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. తాము ఈ సర్వేను ఏ విధంగా చేశామనే విషయాన్ని కూడా వివరించింది. 

అందుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఆ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల ప్లస్ లూ మైనస్ లూ వవిరంచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

1, అసంఘటిత రంగంలోని పేదలు ప్రమాదాల్లో మరణిస్తే, వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం అమలు చేస్తున్న 'చంద్రన్నబీమా'పథకం పట్ల అద్భుతమైన స్పందన 
ఉంది. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి రూ. 2,5000 వరకు ప్రభుత్వం బీమా సొమ్ము అందచేస్తున్నారు. ఈ ఏడాది 91784 కుటుంబాలు ఇలా లబ్ది పొందాయి. శ్రీకాకుళం,కడప,ప్రకాశం జిల్లాలో మేం చూసిన గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజలు ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 
2, కొండ ప్రాంతపు గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం పాలైన ప్రజలు ఆసుపత్రికి చేరుకోవడానికి సరైన దారులు లేవు. వారికి తక్షణం వైద్య చికిత్స అందించి , సురక్షితంగా సమీప ఆరోగ్యకేంద్రానికి చేర్చడానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్నంగా బైక్‌ ఆంబులెన్స్‌లను ఐటీడీఏ ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. 'గత ఏడాదిలో వీటి వల్ల 1,637 రోగులు సకాలంలో ఆసుపత్రులకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. వీటిలో ఎక్కువ కేసులు గర్బిణీ స్త్రీలకు సంబంధించినవే.. ' అని మాతో ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మార్కెటింగ్‌ కోఆర్డినేటర్‌ అంకిత పురోహిత్‌ అన్నారు. '' బైక్‌ ఆంబులెన్స్‌ల వల్ల ప్రాణాలు కాపాడుకున్నామని'' సీతంపేట, పాడేరు ఏజెన్సీలలో సవర గిరిజన కుటుంబాలు చెప్పారు. దీని వల్ల గిరిజన ప్రాంతాల్లో గతంలో కంటే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. 
3, ఇటీవల ప్రభుత్వం ప్రచారం చేస్తున్న 'పసుపు కుంకుమ' పథకం కూడా గ్రామీణ మహిళలను బాగా ఆకట్టుకుంది. స్మార్ట్‌ ఫోన్లు మీద కూడా, పేద మహిళలు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో ఎవరూ సెల్‌ ఫోన్లు కొనడం లేదని,దీని వల్ల పోన్ల అమ్మకాలు పడిపోయాయని అమాలాపురంలోని ఒక మొబైల్‌ ఫోన్‌ దుకాణం దారుడు అన్నాడు. 
4, కరవు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచడంలో ప్రభుత్వం చేసిన కృషిని రైతులు గుర్తించారు. ఉపాధి హామీ ద్వారా గత ఐదేళ్లలో 6,20,635 పంట కుంటలు తవ్వారు. దీని వల్ల '' వానా కాలంలో నీరు వృధాగా పోకుండా ఎక్కడికక్కడ నేలలోనే ఇంకి, సాగు విస్తీర్ణం పెరిగి, పంటల దిగుబడి బాగుంది.'' అని విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లా రైతులు చెప్పారు. 
5, కోస్తా తీర ప్రాంతాల్లోని జాలరుల పట్ల గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపాయి. కానీ, టీడీపీ ప్రభుత్వం చేపలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకోవడానికి వీలుగా చేపలు ఎండబెట్టుకోవడానికి తీర ప్రాంతాల్లో, 363 ప్లాట్‌ ఫారాలను నిర్మించింది. ''దీని వల్ల అమ్ముకోగా మిగిలిన తాజా చేపలను ఎండు చేపలుగా ఆరబెట్టి నిలువ ఉంచి, పోటు సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లని రోజుల్లో, అమ్ముకొని జీవిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా , కళింగపట్నం తీరంలోని మహిళలు మాతో చెప్పారు. 
6, సాగునీటి శాతం అంతంత మాత్రమే ఉన్న ప్రకాశం జిల్లాలో 'ఎన్టీఆర్‌ జలసిరుల' పథకంలో సోలార్‌ బోర్లు సబ్సిడీలో ఇవ్వడం కూడా, ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పధం పెరిగింది. '' విద్యుత్‌ తో పనిలేకుండా అవసరమైనపుడల్లా సోలార్‌ పంప్‌సెట్‌తో మా పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నాం'' అని ప్రకాశం జిల్లా, తూర్పునాయుడుపాలెం రైతులు మాతో చెప్పారు. రాష్ట్రవ్యావ్తంగా 18.584 బోరుబావులకు సోలారు విద్యుత్‌ సౌకర్యం కల్పించడం వల్ల 92.935 ఎకరాలు భూమి సాగులోకి వచ్చింది. 
7, పేద మహిళలకు మరుగుదొడ్డి ఒక తీరని స్వప్నం.ఉండటానికి నీడ లేకపోయినా, మరుగు దొడ్డి ఉంటే చాలనుకుంటారు. వారి కలలు నిజమవుతున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో 9,20,654 కుటుంబాలకు వ్యక్తిగత మరుగు దొడ్లునిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. 
8, పారిశ్రామిక ప్రగతి టీడీపీకి సానుకూలంగా మారింది. చిత్తూరు,నెల్లూరు సరిహద్దుల్లోని శ్రీసిటీలోని ఇసుజి, ఫాక్స్‌కాన్‌, అనంతపురంలో కియా మోటార్స్‌ సంస్ధల్లో ఉపాధి అవకాశాలు పెరగడం పారిశ్రామిక ప్రగతికి సూచిక. శ్రీసిటీలో దాదాపు 60 వేలు, కియా ప్లాంట్‌లో 4వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగడం కూడా ఆ ప్రాంతాల నిరుద్యోగుల ఓట్ల పై ప్రభావం ఉంటుంది. 

ప్రభుత్వ వ్యతిరేక అంశాలు 

1, టీడీపీ,జనసేన పార్టీ నాయకులు 'ఆంధ్రా వాళ్లను తెలంగాణా లో కొడుతున్నారు ...'' అని పదే పదే ప్రచారం చేయడం వల్ల, రాజకీయ స్వార్దం కోసం ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాస్ట్రాల మధ్య విధ్వేషాలు పెంచుతున్నారనే భావన విద్యావంతుల్లో 
తీవ్రంగా ఉంది. 
2,పార్వతీపురం,అరకు మన్యం ప్రాంతంలో ప్రాధమిక వైద్య సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం టూవీలర్‌ వెళ్లడానికి కూడా రహదారుల లేని గిరిజన పల్లెలు అనేకం ఉన్నాయి. రహదారుల నిర్మాణంలో ఐటీడీఏ పూర్తిగా విఫలం అయిందని అడవి బిడ్డలంటున్నారు. ప్రసవ వేధన పడుతున్న గర్భిణీ స్త్రీలను డోలీలో మోసుకొని రావడం సర్వసాధారణంగా మారడం ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. 
3, రాష్ట్రంలో విద్యుత్‌ లేని కుగ్రామాల సంఖ్య రెండు వందలకు పైగా ఉన్నట్టు మా పరిశీలనలో తెలిసింది. ' కరెంట్‌ బల్బ్‌ ఎలా ఉంటుందో మాకు ఇప్పటి వరకు తెలీదు. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌కి రెండు కిలోమీటర్లు పోవాలి. మా గ్రామం మీద తరుచూ ఏనుగులు దాడి చేస్తుంటాయి, అయినా అధికారులు మా వైపు చూడరు.'' అని చిత్తూరు జిల్లా,మాధవరం కుయ్యవంక గ్రామస్తులు మాతో చెప్పారు. విశాఖ జిల్లా,పాడేరు ఏజెన్సీలో వందలాది కుటుంబాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అలాంటి గ్రామాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే భావన ఉంది. 
4, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నైపుణ్యం 
ఉన్నవారికి కూడా ఉపాధి అవకాశాలు దొరకడం లేదని నెల్లూరు జిల్లా, తడ సమీపంలోని ఒక ఐటీఐ చదివిన నిరుద్యోగి మాతో అన్నారు. ''రాని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బతుకు తెరువు కోసం మట్టిపనులు చేసుకొని బతుకుతున్నాం..'' అని అరకు సమీపంలోని పెద్దలబుడు యువకుడు మాతో అన్నాడు. ఆ గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్నారు. 
5, వృద్దులు,వికలాంగులు, రైతులకు అందాల్సిన కొన్ని పథకాలలో జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువగా ఉందని, దానివల్ల లబ్దదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాదాపు అన్ని ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న ఆరోపణ. 
6, మారు మూల పల్లెల్లో ప్రాధమిక విద్యకు పిల్లలు దూరం అవుతున్నారు. గత ఐదేళ్లలో 11305 కిలో మీటర్లు గ్రామీణ రహదారులు వేసినట్టు ఉపాధి హామీ పథకంలో లెక్కలున్నప్పటికీ, సరైన రహదారులు లేవన డానికి ఉదాహరణ, విజయనగరం జిల్లా, బోరి గ్రామంలో పిల్లలు బడికి వెళ్లాలంటే కాలువలు ఈదుతూ వెళ్తున్న దృశ్యం రికార్డు చేశాం.
7, రాష్ట్రవ్యాప్తంగా 87వేల కోట్లకు పైగా, రైతు రుణాలున్నాయి. వీటిలో 24వేల కోట్ల రుణాల్ని మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగతా 63వేల కోట్ల రుణాల సంగతేంటి? ఐదేళ్లలో విడతలవారీగా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పిన టీడీపీ సర్కారు ఆ అంశాన్ని పట్టించుకోక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. 
ఎన్నికల సమీకరణలు 
ఓవరాల్‌గా తెలుగు దేశం,వైఎస్సార్‌ సీపీకి మధ్యే పోటీ ఉన్నప్పటికీ, జనసేన పార్టీ వామపక్షపార్టీలు, బీఎస్‌పీ తో ఒక కూటమిగా పోటీ చేయడం వల్ల వైసీపీ వైపు ఉండే దళిత ఓట్లు చీలే అవకాశం ఉంది. 2014లో బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేసింది. ఇపుడు విడిగా పోటీ చేయడం వల్ల తెలుగు దేశం ఓట్లు కొన్ని చీలి వైఎస్సార్‌సీపీకి పడే అవకాశం, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పడే కాపు ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

'' అసలు టీడీపీ మాకు పోటీనే కాదు, వైఎప్‌ఆర్‌సిపి నే మా ప్రత్యర్ది. గోదావరి జిల్లాల్లో అన్ని సీట్లు మావే, మా ఎన్నికల ప్రణాళికలోని, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌ బదులు నగదు, రైతులకు పెన్షన్‌ పథకాలే మాకు 50 శాతం సీట్ల తెచ్చి పెడతాయి..' అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ,చిత్తూరు జిల్లా జనసేన లీగల్‌ సెల్‌ ప్రతినిధి కవిత ఆరని. 

నోట్: ఈ సర్వేతో మా సంస్థకు ఏ విధమైన సంబంధం లేదని పాఠకులు గమనించ మనవి. రూరల్ మీడియా విడుదల చేసిన సర్వేను యధాతథంగా అందించాం.

సంబంధిత వార్తలు

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

Follow Us:
Download App:
  • android
  • ios