Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు ఛాన్సిస్తే.. తినే తిండిలో విషం కలుపుకున్నట్లే: బాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు వైసీపీలోకి క్యూకడుతున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా మంగళవారం అమరావతిలో ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు

ap cm chandrababu naidu fires on ycp chief ys jagan
Author
Amaravathi, First Published Apr 2, 2019, 11:37 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు వైసీపీలోకి క్యూకడుతున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా మంగళవారం అమరావతిలో ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ మొసళ్లు తెగ కన్నీరు కారుస్తున్నాయని.. ఒక్కసారే కదా అని తినే తిండిలో విషం కలుపుకోం కదా... లోయలో దూకం కదా అని సీఎం వ్యాఖ్యానించారు.

పసుపు-కుంకుమ డబ్బులు ఆపాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆడపడుచులకిచ్చే పసుపు-కుంకుమను ఎవరైనా అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్దె మైకులు, వలస పక్షులు వైసీపీకి మద్ధతుగా  ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారని చంద్రబాబు జోస్యం చెప్పారు. పులివెందులలో తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని.. అన్ని చోట్లా టీడీపీపై సానుకూలత వ్యక్తమవుతోందన్నారు.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి ఏపీకి జగన్ హోదా తెస్తారా అని సీఎం ప్రశ్నించారు. సాగర్, శ్రీశైలం తమకే ఇవ్వాలన్న వ్యక్తితో కుమ్మక్కవ్వడమేంటని నిలదీశారు. కోర్టు కేసుల కోసం మోడీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు.     
 

Follow Us:
Download App:
  • android
  • ios