Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ అభ్యర్థికి బెస్ట్ విషెస్ చెప్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

నామిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు.  అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన  చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను

allu arjun says best wishes to ysrcp mla candidate silpa ravichandrareddy
Author
Hyderabad, First Published Apr 6, 2019, 10:32 PM IST

హైదరాబాద్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ చెప్తూ బన్నీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ లేఖను అప్ లోడ్ చేశారు. 

నామిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు.  అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన  చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. 

మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన’ని బన్నీ లేఖలో పేర్కొన్నారు. 

ఇకపోతే శుక్రవారం అల్లు అర్జున్ జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగాబాబుకు మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. తాము ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. మోరల్‌గా ఎప్పుడూ నాగబాబు వెంట ఉంటామని ఆయన పేర్కొన్నారు. 

అయితే నిన్న నాగబాబుకు మద్దతు తెలిపిన బన్నీ.. నేడు రవిచంద్రారెడ్డికి అభినందనలు తెలుపుతూ పోస్ట్‌ చేయడం ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికి స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios