Asianet News TeluguAsianet News Telugu

అధికారమిచ్చిన ప్రజలను నడిరోడ్డుపై నిలబెడతారా..?: డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేష్ లపైరోజా ఫైర్

 కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్‌ జాబితాను చోరీ చేసిన నేరంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి లోకేష్‌ అంటూ రోజా విరుచుకుపడ్డారు. తండ్రీకొడుకులిద్దర్నీ అరెస్ట్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు.

ysrcongressparty mla roja slams chandrababu
Author
Ananthapuram, First Published Mar 8, 2019, 3:36 PM IST

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు, లోకేష్‌లను వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

అనంతపురం జిల్లాలో మహిళా గర్జన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్‌ జాబితాను చోరీ చేసిన నేరంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి లోకేష్‌ అంటూ రోజా విరుచుకుపడ్డారు. తండ్రీకొడుకులిద్దర్నీ అరెస్ట్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల విలువైన సమాచారాన్ని దొంగిలించి ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చారని, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. 

డేటా చోరీ కేసులో ప్రధాన నిందితులు చంద్రబాబు, లోకేష్‌ అని ఆరోపించారు. వారి సహకారంతోనే డేటా లీక్‌ అయిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఫారమ్‌ –7 అంటూ డ్రామాలు ఆడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఐదేళ్లు పాలించాలని అధికారం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు నడిరోడ్డున నిలబెట్టాడని రోజా ధ్వజమెత్తారు. చేసిన నేరాన్ని ఒప్పుకొని చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios