Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి నుండి బాబు ఎన్నికల ప్రచారం

:ఈ నెల 16వ తేదీన తిరుపతి నుండి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుండి  చంద్రబాబునాయుడు రోడ్‌షో‌లను ప్రారంభించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

chandrababunaidu to start election campaign from tirupati
Author
Amaravathi, First Published Mar 11, 2019, 2:44 PM IST


అమరావతి:ఈ నెల 16వ తేదీన తిరుపతి నుండి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుండి  చంద్రబాబునాయుడు రోడ్‌షో‌లను ప్రారంభించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే నెల 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబునాయుడు దాదాపుగా పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి చంద్రబాబునాయుడు తిరుపతి నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుడతారు. తిరుపతిలో సభ నిర్వహించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాబు ఎన్నికల క్యాంపెయిన్‌కు వెళ్లనున్నారు.

ఈ నెల 16వ తేదీ లేదా మరునాడు శ్రీకాకుళం జిల్లా నేతలతో బాబు సమావేశం కానున్నారు. మరోవైపు అదే జిల్లాలో రోడ్‌షోలు నిర్వహించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

రోజుకో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ చోట్ల రోడ్‌షో‌లు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.  ఇంకా అభ్యర్ధులను ఫైనల్ చేయని జిల్లాల్లో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన చంద్రబాబునాయుడు అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబు ప్రచారం: ప్రతి రోజూ బహిరంగ సభ, రోడ్‌షోలు

 

Follow Us:
Download App:
  • android
  • ios