Asianet News TeluguAsianet News Telugu

మా జోలికొస్తే ...ఖబడ్దార్: కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

జగన్ హైద్రాబాద్‌లో ఉండి  కుట్రలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు కేసీఆర్‌తో  జగన్ కుమ్మక్కై  టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు ఆరోపించారు. 

chandrababunaidu reacts on it grid case
Author
Chittoor, First Published Mar 4, 2019, 2:51 PM IST

హైదరాబాద్: జగన్ హైద్రాబాద్‌లో ఉండి  కుట్రలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు కేసీఆర్‌తో  జగన్ కుమ్మక్కై  టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు ఆరోపించారు.  టీడీపీని దెబ్బతీసేందుకు మీ మూలాలు లేకుండా చేస్తానని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం నాడు చిత్తూరు జిల్లాలోని చిప్పిలి వద్ద హంద్రీనీవా జలాలకు చంద్రబాబునాయుడు జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై చంద్రబాబు నాయుడు  ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరని  బాబు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్  నియంతలాగా వ్యవహరిస్తున్నాడన్నారు. నియంతలా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని  చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

తెలుగు జాతికి అన్యాయం జరిగితే వారికి న్యాయం చేసేందుకు తాను ముందు ఉంటానని చంద్రబాబునాయుడు చెప్పారు. డేటా చోరీ పేరుతో తెలంగాణలో తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్ అంటూ తెలంగాణ సర్కార్‌ను  బాబు హెచ్చరించారు.

పనికిమాలిన రాజకీయాలను వదిలిపెట్టాలని చంద్రబాబునాయుడ చెప్పారు. హైద్రాబాద్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ఘనత తనదని బాబు గుర్తు చేశారు. నీ ప్రభుత్వానికి డేటా కూడ లేదన్నారు. నా ప్రభుత్వానికి డేటా ఉందని కేసీఆర్‌పై బాబు ఎద్దేవా చేశారు.

నా ప్రభుత్వ డేటాను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసునని చెప్పారు.ప్రతి రోజూ తాను 50 వేల మందితో ఒకేసారి టెలికాన్పరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు బాబు గుర్తు చేశారు.

మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని బాబు చెప్పారు. ఇప్పటికే తమ రాష్ట్రం కష్టాల్లో ఉందన్నారు. హైద్రాబాద్‌ను 60 కష్టాలు కష్టపడి అభివృద్ధి చేశామన్నారు. హైద్రాబాద్‌ను తెలంగాణకు ఇచ్చినా నష్టం లేదని అమరావతికి వచ్చినట్టు చెప్పారు.

ఏపీని  ప్రపంచంలో నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేయనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీలో టీఆర్ఎస్‌ పార్టీ లేదు... ఏపీలో టీఆర్ఎస్ లేకుండా టీడీపీని ఎలా ఓడిస్తారని బాబు ప్రశ్నించారు.

మోడీ, కేసీఆర్,  జగన్‌లు కుమ్మక్కై ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. కోడి కత్తి దాడిని మోడీ పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని బాబు విమర్శించారు. దొడ్డి దారిన ఏపీలో పెత్తనం చేసేందుకు కేసీఆర్ చేస్తున్నాడన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. అవసరమైతే నా ఓటును కూడ తొలగించేందుకు సిద్దంగా ఉన్నారని బాబు విమర్శించారు. ఇది ఏపీ రాష్ట్రం.... బీహార్ రాష్ట్రం కాదన్నారు. మీ ఆటలు సాగనివ్వమన్నారు. అవసరమైత మీ తోకలు కత్తిరిస్తామని బాబు  హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

Follow Us:
Download App:
  • android
  • ios