Asianet News TeluguAsianet News Telugu

డాటా చోరీ కుట్ర ఓ మల్టీ విలన్ స్టోరీ... ఆ విలన్లు వీరే: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి వైఎస్సార్ సిపి ఇతర పార్టీలతో కుమ్మకై తమపై కుట్రలు పన్నుతోందని ఏపి సీఎం ఆరోపించారు. ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వం తో పాటు పక్క రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ సహాయాన్ని అందిస్తున్నాయని మండిపడ్డారు. వీరందరు రూపొందించిన కుట్రే ఈ డాటా చోరీ కేసని ఆరోపించారు. ఈ నెల 2,3,4 తేదీలలో విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోనే వుండి డైరెక్షన్ ఇస్తే... తెలంగాణ సీఎం ఆఫీస్ ఆదేశాల ప్రకారం పోలీసులు యాక్షన్ చేశారన్నారు. వీళ్లందరు కలిసి అడ్డంగా దొరికిపోయారన్నారు. ఇలా  డాటా చోరి వ్యవహారంలో మల్టీ విలన్లు వున్నారని చంద్రబాబు ఆరోపించారు. 
 
ap cm chandra babu press meet about data leakage case
Author
Amaravathi, First Published Mar 9, 2019, 4:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి వైఎస్సార్ సిపి ఇతర పార్టీలతో కుమ్మకై తమపై కుట్రలు పన్నుతోందని ఏపి సీఎం ఆరోపించారు. ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వం తో పాటు పక్క రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ సహాయాన్ని అందిస్తున్నాయని మండిపడ్డారు. వీరందరు రూపొందించిన కుట్రే ఈ డాటా చోరీ కేసని ఆరోపించారు. ఈ నెల 2,3,4 తేదీలలో విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోనే వుండి డైరెక్షన్ ఇస్తే... తెలంగాణ సీఎం ఆఫీస్ ఆదేశాల ప్రకారం పోలీసులు యాక్షన్ చేశారన్నారు. వీళ్లందరు కలిసి అడ్డంగా దొరికిపోయారన్నారు. ఇలా  డాటా చోరి వ్యవహారంలో మల్టీ విలన్లు వున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

 వైఎస్సార్‌‌సిపి అధానేత జగన్మోహన్ రెడ్డి, నాయకులు విజయసాయి రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా లను చంద్రబాబు విలన్లతో పోల్చారు. వీరందరు కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని...అయితే వారి ఆటలు తనముందు సాగవని చంద్రబాబు హెచ్చరించారు.

డాటా చోరి కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ కు నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు జరిగినట్లు ఒప్పుకున్నారని అన్నారు. కానీ అంతకుముందు సైబరాబాద్ సిపి సజ్జనార్ దీనిపై ఏమీ మాట్లాడలేదు. అంటే ఒకే కేసులో ఇద్దరు పోలీసు అధికారులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని అన్థమవుతోందని...ప్రజలు దీన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్ సిపి స్క్రిప్ట్ ప్రకారమై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. స్టీఫెన్ రవీంద్ర ప్రిలిమినరీ విచారణ జరిగిందన్నారని...కానీ కేసు పెట్టింది ఎవరో చెప్పలేదన్నారు. వార్తా పత్రికలకు మాత్రం విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్లు లీక్స్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు.

దేశంలో ఒక రాజకీయ పార్టీ మనుగడకే రక్షణ లేకుంటే సాధారణ వ్యక్తులకు, వ్యవస్థలకు రక్షణ ఎక్కడుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యంగబద్దమైన రాజకీయ పార్టీలపై పోలీసులు, కేసులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. అసలు తమ పార్టీకి సంబంధించిన ఆఫీసుకు వచ్చి సోదాలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని చంద్రబాబు తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. 

 అశోక్ అనే వ్యక్తి 10 సంవత్సరాలు కష్టపడి ఓ కంపనీని వృద్దిలోకి తెస్తే...కేవలం టిడిపి కోసం పనిచేస్తుందన్న ఒక్క కారణంతోనే ఇలా కుట్రలోకి లాగారన్నారు. కేవలం తెలుగు దేశం పార్టీకి ఔట్ సోర్సింగ్ చేస్తున్నందుకే అశోక్ పై కక్షగట్టారని...ఏకంగా అతను పారిపోయారని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.కేవలం తెల్లకాగితాలపపై వీర్ఓ లతో సంతకాలు తీసుకున్న పోలీసులపై,  ప్రభుత్వంపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

 టీఆర్ఎస్, బిజెపి, వైఎస్సార్ సిపి నాయకులు గవర్నర్ ను కలవడం కూడా కుట్రలో భాగంగానే జరిగిందన్నారు. అంతేకాకుండా బిజెపి నాయకులు ఈ కేసుపై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని డిల్లీలో పిర్యాదు చేశారని గుర్తుచేశారు. ప్రీప్లాన్ గానే ఇలా తమపై ఎదురుదాడి జరుగుతోందని...తమ పోలీసులు, డిజి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు. చట్ట వ్యతిరేకంగా ఐటీ దాడులు, కోడి కత్తిపై ఎన్ఐఏ కేసు, ఇప్పుడు సిబిఐకి కేసు అప్పగించాలని ఫిర్యాదు చేయడం అటెన్షన్ డైరెక్షన్ కోసమే జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios