Asianet News TeluguAsianet News Telugu

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

తన క్యారెక్టర్ పై సోషల్ మీడియా, వెబ్ సైట్లతో దుష్ప్రచారం చేస్తోంది తెలుగు దేశం పార్టీవారేనంటూ షర్మిల ఆరోపించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. లేకుంటే ఆడపడుచుపై ఇలా దుష్ప్రచారం జరిగితే విలువలతో కూడిన ఏ రాజకీయ నాయకుడైనా స్పందిస్తాడని...కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదని షర్మిల గుర్తు చేశారు. దీన్ని బట్టే ఈ  వ్యవహారం వేనుక చంద్రబాబు హస్తం వుందని స్పష్టంగా  అర్థమదవుతోందని  షర్మిల ఆరోపించారు. 

ys sharmila fires on chandrababu
Author
Hyderabad, First Published Jan 14, 2019, 12:49 PM IST

తన క్యారెక్టర్ పై సోషల్ మీడియా, వెబ్ సైట్లతో దుష్ప్రచారం చేస్తోంది తెలుగు దేశం పార్టీవారేనంటూ షర్మిల ఆరోపించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. లేకుంటే ఆడపడుచుపై ఇలా దుష్ప్రచారం జరిగితే విలువలతో కూడిన ఏ రాజకీయ నాయకుడైనా స్పందిస్తాడని...కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదని షర్మిల గుర్తు చేశారు. దీన్ని బట్టే ఈ  వ్యవహారం వేనుక చంద్రబాబు హస్తం వుందని స్పష్టంగా  అర్థమదవుతోందని  షర్మిల ఆరోపించారు. 

తనకు హీరో ప్రభాస్ తో సంబంధం వుందంటూ గతంలో 2014 ఎన్నికల సందర్భంతో మొదట ప్రచారం మొదలు పెట్టారని షర్మిల తెలిపారు. అయితే  మధ్యలో  ఈ ప్రచారాన్ని నిలిపివేసి తాజాగా మళ్లీ ఎన్నికలు వస్తున్నయి కాబట్టి మరోసారి సోసల్ మీడియాలో ఈ ప్రచారాన్ని ఉదృతం చేశారన్నారు. 

అయితే ప్రభాస్‌ను తానెప్పుడు కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదని అన్నారు. తన పిల్లలపై ప్రమాణం చేసి మరీ చెబుతున్నానని అన్నారు. ఈ ప్రచారాన్ని పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం  చేసి చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు.  రుజవులు, ఆధారాలు చూపించగలరా అని షర్మిల ప్రశ్నించారు. 

తనపై పుకార్లు పుట్టించి కెరెక్టర్ అసాసినేట్ చేయడం దారుణమని షర్మిల మండిపడ్డారు. ఇలాంటి పుకార్లు పుట్టించిన వారికి, వారి వెనకాల  వున్నవారికి సిగ్గుగా లేదా అని  ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని షర్మిల మండిపడ్డారు. 

చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా? వారిపై మేం దుష్ప్రచారం చేయలేమా? కానీ నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలనే తాము ఆ పని చేయలేమన్నారు.  అలాంటి  చర్యలు  దిగకపోడానికి నైతికత, మంచితనమే కారణమన్నారు. తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి నేర్పిన క్రమశిక్షణ, మానవతా విలువల ఆధారంగానే ఆ పని చేయలేమని షర్మిల వివరించారు. 

ఈ ప్రచారం వెనుక చంద్రబాబు హస్తముందని అనుమానంల లేకుండా చెబుతున్నానని షర్మిల అన్నారు. విలువలు, ఎథిక్స్, మోరల్స్ అన్న పదాలు ,చంద్రబాబు డిక్షనరీలోనే లేవన్నారు. చంద్రబాబువి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలేనని షర్మిల ఆరోపించారు.  ఇలా  నీచమైన  రాజకీయాలు చుసే వారెక్కడ కనిపించరని అన్నారు. ఈ పాపం ఊరికే పోదని షర్మిల ఆగ్ర హం వ్యక్తం చేశారు. 

సంబధిత వార్తలు

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

Follow Us:
Download App:
  • android
  • ios