Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై దాడి కేసు: ఏపీ సర్కార్ కు హైకోర్టు అక్షింతలు

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చెయ్యకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఆజమాయిషీ లేని థర్డ్ పార్టీ చేత దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. 

ys jagan case: high court serious on ap and central governments
Author
Hyderabad, First Published Nov 29, 2018, 5:02 PM IST

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చెయ్యకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఆజమాయిషీ లేని థర్డ్ పార్టీ చేత దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. 

అయితే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ ఎందుకు దాఖలు చెయ్యలేదని ప్రశ్నించింది. సోమవారం నాటికి అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని ధర్మానం ప్రకటించింది. 

మరోవైపు వైస్‌ జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ పోలీస్ పరిధి నుండి కేసును సీఐఎస్ఎఫ్‌కు బదిలీ చేసి, జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని కోరారు. 

ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, విశాఖ తూర్పు డివిజన్‌ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌, వైజాగ్‌ పోలీసు కమిషనర్‌, విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై విచారణను కూడా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios