Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు క్రేజ్ ఉండేది, అందుకే బాబుకు పవన్ మద్దతు: నాగబాబు

2014 ఎన్నికల సమయంలో జగన్ కంటే  చంద్రబాబునాయుడు కాస్త మెరుగైన నాయకుడని భావించి ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  టీడీపీకి మద్దతిచ్చారని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు.

why pawan kalyan was supported to tdp in 2014 elections
Author
Amaravathi, First Published Feb 18, 2019, 2:54 PM IST

హైదరాబాద్: 2014 ఎన్నికల సమయంలో జగన్ కంటే  చంద్రబాబునాయుడు కాస్త మెరుగైన నాయకుడని భావించి ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  టీడీపీకి మద్దతిచ్చారని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు.

సోమవారం నాడు  ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన  తన అభిప్రాయాలను వెల్లడించారు. 2014 ఎన్నికల సమయానికి ఏపీలో వైసీపీకి ప్రజల్లో క్రేజీ ఉందన్నారు. కానీ, టీడీపీకి మాత్రం లేదని చెప్పారు.

కానీ, అప్పటికే జగన్‌పై కేసులు, జైలుకు వచ్చిన విషయాన్ని కూడ నాగబాబు గుర్తు చేశారు.ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తే కొన్ని అసెంబ్లీ, ఒకటి రెండు ఎంపీ సీట్లు కూడ వచ్చేవని చెప్పారు.

ఆ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో  జగన్ కంటే చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మేలని టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కులం ఆధారంగా ఏనాడూ రాజకీయాలు చేయలేదన్నారు. 

కాపు సామాజికవర్గాన్ని నమ్ముకొని పవన్ పార్టీని పెట్టలేదన్నారు.  పవన్ కాపు సామాజిక వర్గం కోసం పార్టీ పెడితే టీడీపీకి ఎందుకు మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.కులాల మధ్య ఐక్యత కావాలని పవన్ కళ్యాణ్ కోరుకొంటున్నారని నాగబాబు గుర్తు చేశారు.

రాష్ట్రంలో రెండు కుటుంబాల మధ్యే అధికారం కొనసాగిన పరిస్థితి ఉందన్నారు.రెండు అవినీతికర పార్టీల మధ్య స్వచ్ఛమైన నీతి వంతుడైన తన సోదరుడు పవన్ కళ్యాణ్  నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు.

సంబంధిత వార్తలు

తమ్ముడు అన్నయ్యలా కాదు: తేడా చెప్పిన నాగబాబు

పీఆర్పీని అన్నయ్య అందుకే కొనసాగించలేదు: నాగబాబు

నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్‌కు చిరంజీవి దూరమే

Follow Us:
Download App:
  • android
  • ios