Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

కాంగ్రెస్ పార్టీ తరహ రాజకీయాలను తట్టుకొని వైఎస్ఆర్‌ ఏ రకంగా రాజకీయాల్లో  నిలబడ్డాడో  యాత్ర సినిమాలో చూపించారు. 

what was the role of ysr in congress
Author
Amaravathi, First Published Feb 8, 2019, 2:55 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరహ రాజకీయాలను తట్టుకొని వైఎస్ఆర్‌ ఏ రకంగా రాజకీయాల్లో  నిలబడ్డాడో  యాత్ర సినిమాలో చూపించారు. ప్రజల్లో పట్టు ఉందని నిరూపించుకోవడంతో పార్టీ నాయకత్వమే  ఆయన మాటను కాదనలేకపోయినట్టుగా సినిమాలో చూపించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  సీఎల్పీ నేతగా వైఎస్ఆర్ నిర్వహించిన పాదయాత్ర ఇతివృత్తంగా  యాత్ర సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో  వైఎస్ఆర్ పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనే అంశాలను ఆధారంగా చేసుకొని సినిమాను తీశారు.

కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వైఎస్ఆర్ ను  సుచరితా రెడ్డి సహాయం చేయాలని కోరుతోంది. అప్పటికే రాజకీయంగా ఆ కుటుంబం వైఎస్ఆర్‌కు వ్యతిరేకంగా ఉంది. కానీ, ఆమె తనకు సహాయం చేయాలని కోరినట్టుగా సినిమాలో చూపిస్తారు.

ఉప ఎన్నికల్లో  పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని కూడ ఆమెకు వైఎస్ఆర్ సూచిస్తారు.  రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న కుటుంబం నుండి వచ్చి ఆడపడుచు సహాయం కోసం వస్తే  రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదని తన అనుచరులకు వైఎస్ఆర్ చెప్పినట్టుగా చిత్రంలో చూపారు.

సుచరిత రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ  సుబ్బారెడ్డి అనే అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొంటుంది. సుబ్బారెడ్డికి మద్దతివ్వాలని వైఎస్ఆర్‌ను పార్టీ నాయకత్వం ఆదేశిస్తోంది.

కానీ, తాను అప్పటికే సుచరితారెడ్డికి మద్దతిస్తానని మాట ఇచ్చానని వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి చెబుతాడు.  ఆమెతో దగ్గరుండీ నామినేషన్ వేయిస్తాడు.సుబ్బారెడ్డి నామినేషన్ వేయకుండా  వైఎస్ఆర్ చెప్పినట్టుగానే  నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యంగా  ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు వచ్చి వైఎస్ఆర్‌తో మీరు చెప్పిన టైమ్‌కే వచ్చానా అన్నా అనే సన్నివేశం సినిమాలో ఉంది.

మరో వైపు పార్టీ నిర్ణయించినట్టుగా సుబ్బారెడ్డికి కాకుండా సుచరితా రెడ్డి కి మద్దతిచ్చినందుకు  పార్టీ నాయకత్వం క్రమశిక్షణ నోటీసులు జారీ చేస్తోంది. అయితే ఈ విషయమై పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై  సుచరితా రెడ్డికి  తాను మద్దతిచ్చినట్టుగా ఒప్పుకొంటాడు. 

మరో వైపు తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు,  35 మందికి పైగా ఎమ్మెల్సీలు కూడ ఉన్నారని చెబుతూ పార్టీ నాయకత్వం తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

పాదయాత్ర ప్రారంబించేందుకు వైఎస్ఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకొంటారు.  యాత్రకు ఏర్పాట్లు చేసుకొని రేపు యాత్ర ప్రారంభించే ముందు పార్టీ జాతీయ నాయకత్వం అనుమతి కోసం ఫోన్ చేస్తారు. కేవీపీ పార్టీ జాతీయ నాయకత్వానికి ఫోన్ చేసినట్టుగా సినిమాలో చూపారు.  అయితే రాష్ట్ర, జాతీయ నాయకత్వం వరకు అన్ని కమిటీల అనుమతి తీసుకోవాలని పార్టీ నేత ఒకరు ఫోన్‌లో చెబుతారు.

పార్టీ నాయకత్వం అనుమతి తీసుకోకున్నా కూడ  వైఎస్ఆర్ యాత్రను ప్రారంభిస్తారు. అయితే యాత్రకు అనుమతి తీసుకోకుండానే  ప్రారంభించడంపై అసంతృప్తితో ఉన్నట్టుగా సినిమాలో చూపారు.  అయితే పాదయాత్ర కు ప్రజల నుండి స్పందన వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో వైఎస్ఆర్ పేరును  కూడ చేర్చాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తోంది.

అయితే ఈ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వైఎస్ఆర్‌ను పిలిపిస్తారు. కానీ, కేవీపీ లేకుండానే రావాలని షరతు విధిస్తారు, కేవీపీ లేకుండా వైఎస్ఆర్ ఈ సమావేశానికి హాజరుకాకుండానే వెనుతిరుగుతారు.

ఆ తర్వాత యాత్రకు మంచి స్పందన రావడంతో  రాష్ట్ర నాయకత్వం పంపిన అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్‌కు చూపించి ఫైనల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకొచ్చిన జాబితాలో వైఎస్ఆర్ మనుషులు లేకుండా తమ మనుషుల పేర్లే ఉంటాయి, అయతే ఈ జాబితాను చూడకుండానే వైఎస్ఆర్ 294 అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థుల పేర్ల జాబితాను కాంగ్రెస్ నాయకులకు ఇస్తారు, వీరందరినీ గెలిపించే బాధ్యత నాదే అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు చెబుతూ.. ఇదే విషయాన్ని హై కమాండ్‌కు చెప్పాలని సూచించినట్టుగా సినిమాలో చూపారు.

కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ పోలిన పాత్రను ఈ సినిమాలో చూపించారు. కాంగ్రెస్ పార్టీ పద్దతులకు అనుగుణంగా పనిచేయడం లేదని వైఎస్ఆర్‌కు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెబుతారు.   యాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుండి రెస్పాన్స్ రావడంతో  అప్పుడు యాత్రకు అనుమతిని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేవీపీకి ఫోన్ చేసినట్టుగా చూపించారు.

అయితే ఇప్పుడు యాత్రకు అనుమతిస్తే మళ్లీ యాత్రను ప్రారంభించాలా అని వైఎస్ఆర్ వ్యంగ్యంగా కామెంట్స్ చేయడాన్ని యాత్ర సినిమాలో చూపించారు.  కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను తట్టుకొంటూ వైఎస్ఆర్ రాజకీయాల్లో ఎలా నిలబడ్డాడో ఈ సినిమాలో చూపించారు.

సంబంధిత వార్తలు

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

Follow Us:
Download App:
  • android
  • ios