Asianet News TeluguAsianet News Telugu

శెభాష్.. గో ఎహెడ్: రివర్స్‌టెండరింగ్‌పై జగన్‌ను అభినందించిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.838 కోట్లు ఆదా కావడం పట్ల అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు

union home minister amit shah praises ap cm ys jagan over reverse tendering
Author
New Delhi, First Published Oct 22, 2019, 9:13 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.838 కోట్లు ఆదా కావడం పట్ల అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇదే విధంగా ముందుకు వెళ్లాలని.. జగన్‌ను ప్రొత్సహించారు అమిత్ షా. ఢిల్లీ పర్యటనలో భాగంగా హోంమంత్రితో సుమారు 45 నిమిషాల పాటు జరిగిన భేటీలో వివిధ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌‌పై అనుసరించిన రివర్స్ టెండరింగ్‌ను ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా ఇచ్చారు. ఏపీ సమస్యల పరిష్కారానికి ఇతర కేంద్రమంత్రులతో తాను మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:ప్రత్యేక హోదా ఎందుకు అవసరమంటే...: అమిత్ షాకు జగన్ వివరణ

ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిని సీఎం మరోసారి కోరారు. 

రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్ షా కు జగన్ వివరించారు. గతంలో వీటి వాటా 76.2 శాతం వుండగా తాజాగా 68.2 శాతానికి తగ్గిందని తెలిపారు..

ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని వివరించారు. ప్రధాన నగరాలైన చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలన్న సీఎం తెలియజేశారు.

2014-2015లో రెవిన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్‌షాకు జగన్ గుర్తుచేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ కోరారు.

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టం ద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా  ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా ఆయన హోంమంత్రిని కోరారు.

Also Read:బంగారు బాతును చంపేస్తున్నారు: అమరావతి విషయంలో వైసీపీపై బాబు ఫైర్

వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలని  ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారన్నారు.

ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని జగన్‌ కోరారుఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని తెలిపారు.మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios