Asianet News TeluguAsianet News Telugu

టీడీపిలోకి కోట్ల: చంద్రబాబుపై టీజీ వెంకటేష్ విశ్వాసం

తాజాగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు అందరికీ ఆమోదయోగ్యమైన  నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అందరికీ న్యాయం చేసేలా సీఎం నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకుందన్నారు. కేఈ, బుట్టా రేణుకలకు న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. 
 

TG Venaktesh reacts on Kotla Suryaprakash Reddy's issue
Author
Kurnool, First Published Jan 29, 2019, 5:08 PM IST

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం ఆ పార్టీలో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు ఆయన రాకను బాహటంగా వ్యతిరేకిస్తుంటే మరికొందరు మౌనం దాల్చుతున్నారు. 

అటు జిల్లా రాజకీయాల్లో సైతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కార్యకర్తలు గందరగోళానికి గురవ్వకూడదనే ఉద్దేశంతో మౌనం దాల్చిన నేతలు పెదవి విప్పుతున్నారు. అయితే పెదవివిప్పిన వారంతా భారం చంద్రబాబుపైనే నెట్టేస్తూ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం విశేషం. 

గత కొద్దిరోజులుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రెండురోజులుగా అయితే విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని విందుకు ఆహ్వానించారు. 

విందుభేటీలో కీలక అంశాలపై చర్చించుకున్నారు. అయితే సీట్ల అంశాలపై అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు కోట్ల కుటుంబం కానీ పెదవి విప్పడం లేదు. దీంతో స్తబ్ధుగా ఉన్న నేతలు ఒక్కొక్కరూ నోరువిప్పుతున్నారు. తన సీటుకే ఎసరు వస్తుందని భావిస్తూ గుర్రుగా ఉన్న బుట్టా రేణుక ఎట్టకేలకు స్పందించి నిర్ణయం చంద్రబాబుకే వదిలేశారు. 

తాజాగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు అందరికీ ఆమోదయోగ్యమైన  నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అందరికీ న్యాయం చేసేలా సీఎం నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకుందన్నారు. కేఈ, బుట్టా రేణుకలకు న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. 

ఇకపోతే రాబోయే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు భరత్ ను బరిలోకి దించాలని టీజీ వెంకటేష్ ప్రయత్నిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం టికెట్ తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు సీటుపై రచ్చ  మెుదలైంది. దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

చినబాబు హామీ బుట్ట దాఖలా: కోట్ల రాకతో మారిన పరిస్థితి, బుట్టా రేణుక స్పందన ఇదీ...

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

చంద్రబాబు వ్యూహం: కోట్ల ఫ్యామిలీతో జగన్‌కు చెక్

పసుపు కోటలోకి కోట్ల కుటుంబం: చంద్రబాబుతో భేటీ

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రూట్ క్లియర్: మరి సుజాతమ్మకు...?

మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios